ప్రేమ

ప్రేమ

రచయిత:: బొడ్డు హారిక(కోమలి)

ప్రేమ అంటే ఓ మధురానుభూతి
ప్రేమ సఫలమైతే మన పయనం
ఓ నందన వనము వుతుంది
ప్రేమ విఫలమైతే మన పయనం
రాలిపోయిన పుష్పమవుతుంది
ప్రేమించిన వారు చెంత నుంటే
ప్రతి సమయం సంతోషాల
వెల్లువవుతుంది
ప్రేమించిన వారు పరాయిగా చూస్తే
మది రాయిగా మారి, కనులు
సంద్రమై పొంగును
కానీ ప్రేమ సఫలమైన, విఫలమైన
ప్రేమించిన వారు మన ప్రాణమైతే
ప్రక్కన లేకున్నా , మన నీడగా
నిలిచే ఉంటారు….

You May Also Like

14 thoughts on “ప్రేమ

  1. బాగుందండి మీ కవిత్వం👏👏👏

    1. బొడ్డు హారిక గారి “ప్రేమ “. కవిత చాలా బాగుంది. అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!