తేజో ప్రకాశం

తేజో ప్రకాశం

రచన :: పిల్లి.హజరత్తయ్య

కౌరవులు వందమంది
మద గర్వంతో ఘీంకరించి
ఐదు మంది పాండవుల
చేతిలో హతమయ్యారు..!

బలవంతుడిని నేనేనని
జబ్బలు చరుచుకున్న
ఎందరో మహానుభావులు
కాలగర్భంలో కలిసిపోయారు..!

ధనముంటే చాలునని
డబ్బుకు లోకం దాసోహమని
గడ్డి తిని డబ్బు సంపాదించిన
ధనవంతులు చివరికి నశించారు..!

నేనే చేయగలను?
నేనే గొప్ప యని
కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించిన మేథావులు
మృత్యు హస్తాలకు చిక్కిపోయారు..!

సంస్కారాన్ని మరిచి
పాండిత్యంలో గొప్పవాడినని
విర్రవీగిన మూర్ఖులెందరో
పండితులు కాలేకపోయారు..!

క్షణికమైన రూపాన్ని చూసుకుని
నాకంటే అందమైన వారు లేరని
భావించిన వారందరూ
భావ సౌందర్యానికి తలవంచారు..!

సృష్టిలో ప్రతి జీవిని
దేని ప్రాధాన్యత దానిదేనని
గుర్తించి అహంకారాన్ని వీడిన
తేజో ప్రకాశమై వెలుగుతారు..!

You May Also Like

One thought on “తేజో ప్రకాశం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!