ప్రక్రియ :: సున్నితం
అంశం:: మొక్కలు నాటు సంరక్షించు
రచయిత :: గౌరిశెట్టి శిల్ప రాణి
ఊరు:: మేడిపల్లి
పచ్చని ప్రకృతి అందం
కాపాడుకోవాలి మనం కలకాలం
చక్కని మొక్కలు నాటుదాం
చూడచక్కని తెలుగు సున్నితంబు
పచ్చని మొక్కలు మనకిచ్చు
స్వచ్ఛమైన గాలి ఆరోగ్యమూ
ఎన్నటికి తరగని ఆస్తి
చూడచక్కని తెలుగు సున్నితంబు
పచ్చా పచ్చని వృక్షాలు
తరిగిపోని సిరి సంపదలు
స్వచ్ఛమైన గాలినిచ్చే మొక్కలు
చూడచక్కని తెలుగు సున్నితంబు
కాలుష్యం నుండి రక్షించు
హరిత వర్ణ గనులు
కొట్టేసిన చిగురించు చిరునవ్వుతో
చూడచక్కని తెలుగు సున్నితంబు
తరులు ముందు తరాలకు
తరగని స్వర్ణ నిధులు
పర్యావరణాన్ని కాపాడుకుందాం ఎల్లప్పుడును
చూడచక్కని తెలుగు సున్నితంబు
మనకు నీడనిచ్చు తరువు
పచ్చని సిరిసంపదలకు నెలవు
పుష్కలంగా అందును ప్రాణవాయువు
చూడచక్కని తెలుగు సున్నితంబు
ఇద్దాము పుట్టినరోజు బహుమతిగా
మొక్కలు మారును మానులుగ
మనకు సేదనిచ్చు చల్లగా
చూడచక్కని తెలుగు సున్నితంబు
కమ్మనైన ఫలాలనిచ్చు తరువులు
పచ్చనిచెట్లు ప్రగతికి మెట్లు
సంరక్షించుకుందాం ఉపయోగించి మేధస్సు
చూడచక్కని తెలుగు సున్నితంబు
