నాన్న ఎవరు అంటే
రచన :: లీలా కృష్ణ
అమ్మ పరిచయం చేసిన ఆత్మీయ స్పర్శ నాన్న.
రేపటి రోజుకి దోవ చూపే దిక్సూచి నాన్న.
వెన్నంటి నడిచే బహుదూరపు బాటసారి , ఈ లోకాన.
తన సర్వశక్తులకు లబ్ధిదారి, నేనే అని అంటున్నా.
నా తప్పులను ఎత్తిచూపే మొదటి శత్రువు నాన్న.
నాకన్నా ముందే లోకాన్ని చదివిన జ్ఞాని నాన్న.
నా కోసం వెలిసిన మూలధనం నాన్న.
నా డైరీలోని పేజీలకు సుపరిచితుడు నాన్న.
నాలో ధైర్యం నింపే ప్రథమచికిత్స నాన్న.
నా హృదయం నమ్మిన హామీపత్రం నాన్న.
నా కన్నీరుకి మా నాన్న అంటే భయం.
తను నను తీర్చిన తీరుకి మురిసెను దైవం.
నా అవసరాలు తీర్చే నిత్య అభయం.
నా గర్వానికి కారణం మా నాన్న వైనం.
తాతగారి పుత్రోత్సాహాన్ని నిలబెట్టింది, నాన్న నైజం.
తరాలు మారినా నాన్న తత్వానికి, లేదు ప్రత్యామ్నాయం.
ఏనాడూ తల్లిదండ్రులు అవ్వరాదు, భారం.
సశేషం ఎరుగదు వారి ఋణం.
***