మొక్కలు నాటు సంరక్షించు

ప్రక్రియ :: సున్నితం 
అంశం:: మొక్కలు నాటు సంరక్షించు

రచయిత :: VT రాజగోపాలన్

హరితవిప్లవం తిరిగి తెద్దాం
ఇంటికొకరు మొక్కలు నాటుదాం
పట్టణమంతా పచ్చగా ఉండును
చూడచక్కని తెలుగు సున్నితంబు

పచ్చా పచ్చని చెట్లు
పసిడి పంటలు చూడ
ప్రకృతి మాతకు పరవశమే
చూడచక్కని తెలుగు సున్నితంబు

రోడ్డెడుల్పుకు చెట్లను నరికాం
రోడ్లకు బార్డర్లు వేశాం
మొక్కలు నాటేకి మరిచాం
చూడచక్కని తెలుగు సున్నితంబు

ఎండా ఎక్కువాయె మనకు
మొక్కా నాటకమాయె మనము
మరి ఎట్టా నీడొస్తుందయ్యా
చూడచక్కని తెలుగు సున్నితంబు

మొక్కలు నాటడం కర్తవ్యం
నీరు పోయడం కర్తవ్యం
అని ఎంచితే చాలయ్యా
చూడచక్కని తెలుగు సున్నితంబు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!