మొక్కలు నాటు సంరక్షించు

ప్రక్రియ :: సున్నితం 
అంశం:: మొక్కలు నాటు సంరక్షించు

రచయిత :: మొహమ్మద్ చాంద్ బేగం

మొక్కను నాటు అవనిపై
పచ్చదనాన్ని పెంచు భువిపై
పకృతిని అందించు జగతిన
చూడచక్కని తెలుగు సున్నితంబు

నాటిన మొక్కను సంరక్షించు
జీవకోటి ప్రాణులకు ప్రాణవాయువు
పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించు
చూడచక్కని తెలుగు సున్నితంబు

మొక్క మానుయై నీడనిస్తుంది
పండ్లు ఫలాలను ఇస్తుంది
చక్కని ఔషధాలను అందిస్తుంది చూడచక్కని తెలుగు సున్నితంబు

ప్రకృతి శోభను పెంపొందించు సురక్షితమైన పర్యావరణాన్ని పంచు
భవిష్యత్తు తరానికి అందించు
చూడచక్కని తెలుగు సున్నితంబు

వనాన్ని అధికంగా పెంచు
పుడమిపై వర్షం కురుపించు
పంటలు బాగా పండించు
చూడచక్కని తెలుగు సున్నీతంబు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!