నాలోని తొలకరి పులకరింత

నాలోని తొలకరి పులకరింత….

వానజల్లు చిందులు వేయ్యగా
తొలి చినుకులు ధరణిని ముద్దాడగా
నాలోని ప్రేమ చిగురించేలా 
ముత్యపు తొలకరి పులకరింతలో.. 

నా అణువణువు స్వరాలే పాడుతుంటే
పదాల చిలిపి సైయ్యాటలే  పలికించనా
నా మది భావాలే రెక్కలు తొడిగి
పాటలాకాశంలో తొలకరి పులకరింతనే చేరుకునేను 

ఉషోదయపు అంచులలో 
ఊగిసలాడే ప్రేమ భాషలు
వెచ్చని రవి కిరణాలలో ప్రియుడి  కౌగిలింత 
తొలకరి పులకరింతల అలజడి లేపే నాలో.. 

మెల్ల మెల్లగా విప్పారుతున్న నా కనులలో
చిరునవ్వులతో చిందేసిన చిలిపి నీ మోము
చిత్రంగా కరిగిపోతూ నీ చూపులతో తొలకరి సిగ్గుల పులకరింతల ప్రేమ కావ్యానికి దారి తీసేనోయీ…

రచన : ప్రశాంతి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!