పెనుభూతం (స్వగతం)

పెనుభూతం (స్వగతం)

రచన : పిల్లి.హజరత్తయ్య

సరదా పేరుతో నన్ను దగ్గరికి తీస్తే
కొద్దికొద్దిగా జీవితాన్ని కబళించి
నేను లేకపోతే జీవించలేని
నిస్సహాయ స్థితికి మిమ్మల్ని నెట్టేసి
మీ జీవితాల్ని మింగేస్తాను..!

క్షణకాలం సంతోషానికై
ఫ్యాషన్ కోసమై నను సేవిస్తే
తెలియని లోకాన్ని పరిచయం చేసి
నూరేళ్ళ జీవితంలోని వెలుగులను
కబళించి మిమ్మల్ని’భ్రమ’లోకి నెట్టేస్తాను..!

ఉరికే యవ్వనం గల యువత
పేదరికం ,ఒంటరితనం
మానసిక బలహీనత గల యువతను
లక్ష్యంగా చేసుకుని నా సామ్రాజ్యాన్ని
చాపకింద నీరులా వ్యాపింప జేస్తాను..!

కొకైన్ ,హెరాయిన్ ,బ్రౌన్ షుగర్, చెర్రస్ లాంటి ఎన్నో రూపాలు ఉన్న విషనాగుని
ఆరోగ్యాన్ని,వ్యక్తిత్వాన్ని కబళించి
విచక్షణ లేని ఉన్మాదిగా మార్చేసి
మతిస్థిమితం తప్పించి నాలో కలిపేసుకుంటాను..!

మానాన్ని,అభిమానాన్ని చుట్టేసి
నేరప్రవృత్తికి బానిసలను చేసి
ఆత్మహత్యకు పాల్పడేటట్లు పురిగొల్పి
జీవితాల్ని నిర్వీర్యం చేసేసి
బావి భారత భవిష్యత్ ను చిత్తు చేస్తాను..!

మారణాయుధం కన్న ప్రమాదమైన నన్ను గెలవాలంటే
అక్రమవ్యాపారాలు, దొంగరవాణాకు అడ్డుకట్టవేసి
చట్టాలను గట్టిగా అమలుచేసి
ఎవరికి వారే మేలుకోకుంటే
దేశాన్ని పెనుభూతమై పట్టిపీడిస్తాను

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!