ముచ్చటయిన పాప

ముచ్చటయిన పాప (ఆటవెలది పద్యాలు)

 రచన – గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్

పూలు తలనుపెట్టి పూలకొమ్మనుపట్టి
కలువరేకులవలె కనులుయున్న
ముచ్చటయిన పాప మురిపించి మరిపించి
చూపరులను చేయుచుండె చిత్తు

ముఖము చంద్రబింబమును తలపించగ
ఎరుపు తెలుపు బొట్టు వెలుగుచుండె
మెడనలంకరించె మేలిపూసలపేరు
చిరునగవులు బాగ చిందుచుండె

కాంతులీనుచుండె కాటుక కన్నులు
కనులబొమలు ముక్కు కళగనుండె
కర్ణములకు దాల్చె కనకపు కమ్మలు
కలసియన్ని పాపకందమిచ్చె

పచ్చనాకులందు పాప నిలచియుండె
చోద్యమేదొ ముందు చూచుచుండె
ఎవరుకన్నపాపొ యేయింటి దీపమో
మంచి ఫోజుయిచ్చి మసలుచుండె

దేవుడిచ్చుగాక దీర్ఘాయువును నీకు
పసిడి జీవితముకు బాటవేయి
ముందుముందు నీకు యందుశుభములెల్ల
తెలుగుదేశమందు వెలుగవమ్మ..!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!