ఆనంద+అయ్యో!
రచయిత:: ప్రసాదరావు రామాయణం
ధర్మానికి గ్లాని కలిగిన రోజుల్లో
అవినీతి వ్యాపనం ఆకాశాన్నంటిన రోజుల్లో
కవి కన్నీరు అక్షరాలైన.రోజుల్లో
భావి జీవితం భవుని దయనైన రోజుల్లో
రవి సైతం ముఖం చాటేసిన రోజుల్లో
నిస్సహాయతను స్వార్ధం నోట్లుగా
మార్చుకున్న రోజుల్లో
ఆసుపత్రుల్లో చేరినవాడు
రుద్రభూమిలో కాలుతున్న రోజుల్లో
ఆకాశంలో ఓ మెరుపు మెరిసింది
ఓ కంఠం వురుములా గర్జించింది
ప్రపంచం కోసం తాను ఆహుతి అవుతానని
లేదా మహమ్మారిని అంతం చేస్తానని
అహర్నిశలూ ఆలోచన
నిదురను ఆయుర్వేద చింతామనికి
అంకితం చేసి
మూలికా వైద్యాన్ని అధ్యయనం చేసి
యోగిలా జోగిలా అడవులు తిరిగి
తయారు చేసాడు దివ్యౌషధం
గురవయ్యను తలచి
గురి తప్పకుండా విసిరాడు
మరణశయ్యపైనుండి
పరుగులెట్టారు రోగులు!
శాస్త్రీయత ఏమిటి ?
అమ్మ ఉక్కి వుండ శాస్త్రీయమా?
అమ్మ కషాయం శాస్త్రీయమా?
అమ్మ వైద్యంతోనే
అన్ని రోగాలూ పోయాయే!
శాస్త్రీయం కాదా రొగోపశమనం?
నీ టీకాలు శాస్త్రీయమా?
నీ రెండేసివర్ శాస్త్రీయమా?
శాస్త్రీయమైతే ఎందుకు చస్తున్నారు?
మనం లెక్కలు తేల్చుకుందాం
నీ ఆంగ్ల వైద్యానికి
ఎంతమంది చచ్చారో
ఎంతమంది లేచి తిరిగారో