నా యువరాణి!!

అంశం: ఓ చరవాణి

నా యువరాణి!!

 (తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)


రచన: కొమురవెల్లి నరసింహులు

మాయదారి రోగం మాయ ప్రపంచంలో
మనిషిని చుట్టుకుంది నేడు చూడు
ఆరేళ్ల బాలబాలికల నుండి
60 ఏళ్ల వృద్ధుల వరకు
వ్యాపించింది ఈ మాయ రోగం!

ప్రతి మనిషి తెరవాలి చేతుల్లో
గుండె లోతుల నుండి
తీయటి మాటలు నమ్మి ఫేస్బుక్ పరిచయాలు
పచ్చని సంసారాలు పాడు చేస్తున్నాడు చూడు నేడు!!

చరవాణి మీద ఉన్న ప్రేమ
కన్నవారి మీద లేకపాయె
చరవాణి మీద ఉన్న మమకారం ఆప్యాయత
కన్న బిడ్డల మీద కరువాయే!

పవిత్ర పుణ్యక్షేత్రాలలో
భక్తి పాటలు భజనలు మాయమయ్యే
వాట్సాప్ ఫోటోలు దగ్గరయ్యే
తీర్థప్రసాదాలకు దూరమైనవి
చేతి పోను దగ్గరైనది
ఈ జగతి విచిత్రం

చూడు చూడు ఏమి విచిత్రమో
మాయ ప్రపంచంలో చదరంగం చూడు
మంచితనానికి మానవత్వానికి చోటులేదు
చరవాణి లోకంలో బంగారు భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారు
చూడు భావి పౌరులు!!

కాలగర్భంలో కలిసిపోతున్నాయి
వివిధ రకాల నెట్టు వైరస్ పక్షి జాతి అంతరించి పోతుంది
ఇంకా జీవరాశి మనుగడ శూన్యం
తెలుసుకో లేక పోతున్నాడు మనిషి!!
లలిత కళలు చరవాణి మోజుతో
మాయమైపోతున్నాయి
మనిషన్నవాడు మానవత్వం లేకుండా
మంచితనం లేకుండా పోతున్నాడు!!

చరవాణి చేతుల్లో అందాల యువరాణి
నాట్యం యువత పూజించి ఫోటో కొట్టడం
పోకిరి తనం ఎక్కువ అయినది నేడు
మంచితనం కరువైనది చూడు!!

నాలుగు దిక్కులా వ్యాపించింది
ఈ మాయ రోగం అంతం లేదు
అదుపులో లేదు
అదుపులో ఉంటే అందరికీ మంచిది మిత్రమా!!

టైం ఇస్ గోల్డ్ లైఫ్ ఈజ్ ఐస్ క్రీమ్
టైం బంగారం లాంటిది
జీవితం ఐస్ క్రీమ్ లాంటిది మిత్రమా
మళ్లీ తిరిగి రావు ఎవరికోసం!!

***********

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!