ప్రియమైన నీకు

ప్రియమైన నీకు

రచన:స్వాతి టి (సావరియ)

నీకోసం నా హృదయం
శాశ్వతమైన చిరునామా

యవ్వన వనమా ఎప్పటికీ ఇలాగే
ప్రేమ నింపి నీ తోడై వుండిపోనా
ఆనాడు చిగురించిన వసంతమా
ఏనాటికైనా మురిపించే మధుమాసమా

తనువంతా తడిమే తపనలోనే కాదు
తన చిక్కిన చెంపల్లోనైనా చిరునవ్వు చిందేలా
తోడై వుండే బంధమా శాశ్వత అనుబంధమా
ప్రేమ పరిమళానికి నిర్వచనమై నిలిచి
ఎప్పటికీ వికసిస్తూ వాడని పుష్పమా

ఒక్క ముద్దు పంచి ప్రేమ పెంచే
పరువాల సిగ్గుల చెక్కిళ్ళు
తాకినపుడు నువ్వెంత ఇష్టమో
పాల బుగ్గల బుజ్జయినిచ్చే
నీ చెంపల ముదుసలి ముడతల
మధ్య నలిగిన ఆ పూసే చిరునవ్వు
చెదరని నీ మొహము పంచే
పసినవ్వులు తలపించే
మన చివరి రోజులు కూడా
నువ్వంటే అంతే ఇష్టము

స్వాతి (సావరియ)©️

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!