పెంచుకో పంచుకోకు

పెంచుకో పంచుకోకు

రచన: స్వాతి (సావరియ)

ఆస్తులు పంచుకున్నారు సరే
కానీ అమ్మ నాన్నని కూడా
పంచుకుంటున్నారెంట్రా…
నెల నీ దగ్గర నెల నా దగ్గర అని

పెంచుకున్నది పంచుకోమని కాదు

నిన్ను కుడా మీ అమ్మ నాన్న ఇలాగే
నెల నీ దగ్గర నెల నా దగ్గర అని
పంచుకుని పెంచి వుంటే
తెలిసేదెమో ప్రేమ విలువ….

అమ్మ ఇప్పుడు అంత బరువా నీకు
అయిన అమే నిన్ను
పుట్టే దాకా కడుపులో మోసింది
పుట్టాకా పొత్తిళ్ళలో పెంచింది
కడుపు నిండా వండి పెట్టింది
భారమనకుండా వెన్నంటి సాగింది

నాన్న అంటే అంత నరకమా
గుండెల మీద గూడు కట్టి కాపాడాడు
వేలు పట్టి నడిపించాడు
వేలు పెట్టి పోషించాడు
తల దాచు గూడు ఇచ్చాడు
తన హృదయంలో నీ
భవిష్యత్తును అందంగా లిఖించాడు

నీకు నడక నేర్పించిన నాన్నకు
నడవ లేని స్థితిలో అలసిన పాదాలను
నాలుగు సార్లు తింపి నారాజు చేస్తే
ఓపిక లేని శరీరం బాధతో హృదయం రాపిడైపొద్ది

అయిన ఇప్పుడు మిరెంటిర
వారి వృద్ధ్యపాన్ని గ్రద్ధలగా పిక్కుతింటున్నరు
ఇప్పటికైన కొందరు ఇలాంటి ప్రబుద్ధులారా
నీ తల్లి తండ్రుల పట్ల దయతో కాదు
ప్రేమతో కనీస శ్రద్ధ చూపించండి

మళ్ళీ మళ్ళీ రాని అవకాశం
అమ్మానాన్నలకు అమ్మ నాన్నయ్యే
అందమైన ఆ అరుదైన ఆ క్షణం

పట్టెడన్నం పెట్టీ
పెదవెంట చిరునవ్వు పోసి
పలకరించు ప్రతిరోజూ పలుమార్లు
పాల నవ్వులు పండు ముసలి చెంపల్లో
ప్రేమ ఒలికి పరిమళమై గుప్పిస్తుంది

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!