పవిత్ర మాసం

(అంశం:”శ్రావణమాసం విశిష్టత”)

పవిత్ర మాసం

-పిల్లి.హజరత్తయ్య

శ్రావణమాసమంతా భగవన్నామస్మరణతో
గృహాలన్నీ దేవుని కోవెలలై
పండుగ వాతావరణం కొట్టొచ్చేలా
ప్రతి ఇల్లు కళకళలాడుతుంటుంది..!

స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకుని
ముత్తైదువులకు శనగలు వాయనమిచ్చి
మాంగల్యాన్ని కాపాడమని కోరుతూ
నోముల నోయడం కనబడుతుంది..!

శ్రావణంలో చేపట్టే కార్యాలకు
పవిత్రత సంప్రాప్తించి
విశేష ఫలితాలు వచ్చునని
వేద పురాణాల్లో చెప్పబడింది..!

అన్నా చెల్లెలు అనుబంధమై
సుమంగళి నోముకు ఆలంబనమై
సౌఖ్యాలనిచ్చే వరలక్ష్మీ వ్రతమై
కృష్ణాష్టమి ఆరాధనమై
సకల సౌభాగ్యాలను కలుగుజేస్తుంది..!

సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకయై
వర్షాగమనమునకు సూచికయై
ప్రకృతంతా శోభాయమానమై కనబడుతుంది..!

సకల జీవరాశులకు శుభాలనిచ్చే
పవిత్ర మాసమై విరాజిల్లుతుంది..!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!