బడి పిలుస్తోంది

(అంశం:”బాల గేయాలు”)

బడి పిలుస్తోంది.!

-పిల్లి.హజరత్తయ్య

పల్లవి :
చిన్ని చిన్ని రావమ్మా
పలక బలపం తేవమ్మా // చిన్ని //

చరణం 1
బడి పిలుస్తోంది రామ్మా
బడియే నీకు వెలుగమ్మ
పంతులు చెప్పేది వినవమ్మా
ప్రకృతి చెంతకు రావమ్మా
పాటలు బాగా నేర్వమ్మా
ఆటలు చక్కగా ఆడమ్మా // చిన్ని //

చరణం 2

మధ్యాహ్నభోజనం తినవమ్మా
అరిగే దాకా ఎగురమ్మా
హాయిగా నీవు ఉండమ్మా
ఆడుతూ పాడుతూ పెరుగమ్మా
అందరితో కలిసి నడువమ్మా
అదియే నీకు రక్షమ్మా
//చిన్ని//

చరణం3
అక్షరాలను పలుకమ్మా
గేయాలను పాడమ్మా
పుస్తకాలను చూడమ్మా
బొమ్మలను పరిశీలించమ్మా
ఆహ్లాదంగా ఉండమ్మా
ఆరోగ్యంగా ఎదుగమ్మా

// చిన్ని //

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!