సమాజ హితం 

సమాజ హితం 

-కార్తీక్. దుబ్బాక

సమాజంతరాలలో
నలుగుతున్న జనం
భారత సమాజం లో
హెచ్చు తగ్గులగోలఎక్కువ
దేవాలయాలలోపూజరుల కులగోత్రాల గోడుతో దైవపూజ
మనుషుల్లో మానవత్వం
మంట గలిపి
మతాల, మఠాల పేరుతో
భేదాలు, తేడాలు చొప్పించి
ప్రాంతీయ భేదాలుసృష్టించి
ధనదోపిడీలు, అరాచకాలు
రాజకీయాలు చేతులు దూర్చి
ప్రజలలోఅసమానతలుకల్పించి
కులాలు కుళ్ళు కంపుతో
కళ్ళు మూసుకొని జనం
కొట్టు కుంటున్నారు నేడు
మానవ రూపంలో దేవుడు
సేవ పేరుతో దోపిడి
దేహల దారుడ్యంలోతప్ప
మనుషులు మధ్య తేడాలేదు
రూపాయిలులేనిరూపాలు
అందహీనం
రూపాయలు ఉన్న మనుషుల
రూపు అందం
బేధాలు, తేడాలు డబ్బులో
మనుషుల్లో కాదు
తెలిసిన మారని మనుషులు
మనువాద సిద్ధాంతులు
సంప్రదాయంమాటున
మంటగలిపే ఆచారములు
చుడి మంటలై రేగుతున్నాయి
సంస్కృతి చాటున దాడులు
కొనసాగుతున్నాయి,
మతోన్మాదం మనుషుల మధ్య
కాకుంటేకొట్లాటలుకులాలధ్య,
మమతలు మంట గలిపి
కన్న బిడ్డల్ని చంపుతున్నాయి

ఏనాడు ఎవరు రగిలించారో
కుల అగ్ని జోలలు, నేటికి
ఆరని ఆ మంటల్లో కాలిన
అమాయకులెందరో
కులరక్కసి కోరల్లో సమిదలైన
ప్రేమపక్షులు ఎందరో
కులాల గోడల్ని కూల్చేదెన్నడు?
మనుషుల్లోమమతలుసాటె
దెన్నడు?
రక్తం రగిలి పోతున్న
శరీరం కాలి పోతున్న
కదలని, మెదలని
అచేతన జీవులెందరో..
ఆలోచన పరులెందరో…
ఎవరో ఒకరు రావాలి
చైతన్యం కల్గించాలి
సమైక్య గీతం పాడాలి
సఖ్యత కల్గించాలి
సమాజంలో మార్పులు తేవాలి.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!