నిజాలు

నిజాలు

— గుడిపూడి రాధికారాణి

ఆత్మీయత జల్లులో
తడవాలని తపనుందా?
ప్రేమ పంచినప్పుడే
పొందగలవు తెలిసిందా?

గాయపరచవద్దంటూ
కత్తినడిగి లాభమేమి?
కన్నీటిని కార్చొద్దని
కంటినడిగి ఫలమేమి?

కనురెప్పల లోగిలిలో
భాష్పమొకటి చేరిందా?
గుండెగూటి వ్యథ గాధను
మోసుకుంటు వస్తోందా?

చెలిమి క్షీర ధారలలో
విషపుచుక్క చేర్చ లేను
ఆ నైజం నీకుంటే
చెయ్యపట్టి నడవలేను

***

You May Also Like

One thought on “నిజాలు

  1. ధన్యవాదాలు కార్తీక్ గారు!
    నిజాలు ఒక నూతన లఘుకవితా ప్రక్రియ.
    శ్రీమతి కపిల తాడూరి గారు ఈ ప్రక్రియ రూపకర్త.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!