ఎడబాటు

*ఎడబాటు*

కన్నులు కాయలు కాచెను నీ ఎడబాటులో…

గుండెలు బండబారెను నీ ఎడబాటులో…

కన్నుల తడి ఆరనంటుంది నీ ఎడబాటులో…

మానదు మోడువారెను నీ ఎడబాటులో…

 

ఒకసారి కనిపించవా…

నా కళ్ళలో కాంతులు నింపడానికి…

ఒకసారి కనిపించవా…

గుండెమంటలు చల్లార్చడానికి…

ఒకసారి కనిపించవా…

నా కన్నులలో సుమసౌరభలను పూయించడానికి…

ఒకసారి కనిపించవా…

నా మౌనంలో మురళీ నాదాలను పలికించడానికి…

ఒకసారి కనిపించవా…

నా నమ్మకం నిజమని నిరూపించడానికి…

ఒకసారి కనిపించవా…

చివరిసారి నీ రూపం అపురూపమై నిలిచిపోవడానికి…

ఒకే ఒక్కసారి కనిపించవా…

మరునిమిషం మరణంలో కూడా నీ తోడు నిలవడానికి…

                                             రచన:G.V.లక్ష్మి

You May Also Like

One thought on “ఎడబాటు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!