వరకట్నం

వరకట్నం

ఇది ఆచారమా? కాదు దురాచారం 

సమాజాన్ని పట్టిపీడిస్తున్న

 పిశాచం ఈ వరకట్నం

 

నేడు పెళ్లంటే వ్యాపారం

వధువు కన్నీళ్లతో బేరం

కళ్యాణమంటే కట్నమంటూ 

కాపురమంటే కానుకలంటూ

వారి కష్టాన్ని,శ్రమని దోచుకునే

దోపిడీ భూతం ఈ వరకట్నం

 

కట్నం ఇవ్వలేదని

అదనపు కట్నం తేలేదని

కాపురాలు చేయనివ్వని అత్తలెందరో

పెళ్ళికి చేసిన అప్పులు తీర్చలేక

రక్త,మాంసాలని అమ్ముకున్న తల్లితండ్రులెందరో

 

అడగడుగునా కట్నం పేరుతో

వేదిస్తూ, చిత్రహింసలు పెడుతున్న భర్తలెందరో 

కిరోసిన్లు,గ్యాస్ సిలిండర్లు పేల్చి 

కడతేరుస్తున్న అత్తమామలెందరో

 

స్త్రీ గడప దాటి చంద్రమండలం వరకు 

వెళ్ళగలిగేలా మారినా 

ఈ దురాచార పరిస్థితిని మాత్రం 

ఎదుర్కోక తప్పట్లేదు…

 

ఓ స్త్రీ ఇకనైనా మేలుకో

ఇంకెన్నాళ్లు భరిస్తావు ఈ బాధని 

కన్నీళ్లు కారిస్తే లాభం లేదు

చరిత్ర తిరగరాసే శక్తి నీలో ఉంది 

మీకే పుట్టి, మీ చేతిలోనే పెరిగి

మీ పైనే ఇన్ని అరాచకాలని

చేస్తుంటే చూస్తూ ఊరికే ఉంటావా

వాడు ఎవడైనా సరే నేడే తిరగబడు

 

ఈ వరకట్న దురాచారాన్ని 

రూపుమాపే తరుణం ఇదే

మీరంతా అంతా ఒకే తాటిపై నిలబడి 

ఒక్కొక్కరు ఒక్కో భద్రకాళికా రూపమై

సముద్రాల బడబాగ్నిలై

ప్రళయాగ్ని గోళాలై కదలండి

ఉద్యమించండి

సమూలంగా వరకట్నం అనే దురాచారాన్ని రూపు మాపాలి 

కొత్త చరిత్రకి నాంది పలకాలి…

                                                                                                                           రచన :: ఉదయగిరి దస్తగిరి✍️

You May Also Like

One thought on “వరకట్నం

  1. చాలా బాగుంది గిరి..ఈ అనాచారం ని రూపు మాపటానికి అందరూ ముందడుగు వేయాలి అని చెప్పిన తీరు బాగుంది..👌👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!