బాపూజీ

★ బాపూజీ ★

అడుగడుగడుగో

అతడే అతడే!

అర్ధనగ్నంగా ఉన్నాడే

అంగవస్త్రంతో

నీలా బోసినవ్వు

పాలలా పోస్తున్నాడే

వెన్నెలంతా నోట నింపుకుని…

రివటలా వున్నాడు చూడు

గట్టిగా గాలి వీస్తే 

ఎగిరిపోతాడేమో కదా

అందుకే కర్ర పట్టుకున్నాడేమో!

ఆ బొమికెల గూడులో

ఎంత తేజమో గదా!

మిట్ట మధ్యాహ్నపు మార్తాండునిలా

ఆ గుండూ,ఆ సోడాబుడ్డి అద్దాలు

అతడేరా చిన్నా అతడే

ఆంగ్లేయులకు బెదురు పుట్టించాడు

బ్రిటీషువారిని గెంటివేశాడు

యుద్ధం చేసి.కాదు నాన్నా

అణుబాంబు కన్నా భయంకరమైన

శాంతి మంత్రంతో!

అహింసా వాదంతో

అలాటి వాడు ఈ భూమిపైనే

తిరిగాడంటే ఆశ్చర్యంగా లేదూ!

                               రచన :: ప్రసాదరావు రామాయణం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!