వలస జీవితం 

వలస జీవితం 

రచయిత :: ప్రసాదరావురామాయణం

వలస పక్షుల్లా ఎగిరిపోతున్నాం
పులసకోసం మూకుమ్మడిగా
కరువులూ కాటకాలూ
మారణ హోమాల్లా మాకాళ్ళక్రింద నిప్పులు పోశాయ్
వందనం నా పల్లె సీమా!
నేస్తాలూ సెలవు మరి!

మోసుకపోతున్నాం….
మా రెప్పకింద కన్నీటిని

మోసుకపోతున్నాం….
ఈ చిన్న తిత్తిలో ఇంటి మట్టిని
మా గుండెలలో మాసిపోకుండా మా పల్లె

మోసుకు పోతున్నాం…
మా గ్రామ,పొలాల పేర్లనూ జ్ఞాపకాలనూ

మోసుకపోతున్నాం….
మా చేతులనూ,కాళ్ళనూ
బొమికలనూ, మేధస్సునూ

మోసుకపోతున్నాం
మా డిగ్రీలనూ, డిప్లొమొలనూ
అక్కడ నిరుపయోగమైనా

వాలాం ఓ చెట్టు కొమ్మలపైన
సూర్యోదయంతో కండలు పిండి
అస్తమయంతో మస్తిష్కంతోమాటలు
ఎదో దిగులు,ఎదో గుబులు

కరొనా వచ్చింది
తిరిగిపొమ్మంది
దారిలో ఆకలి ఎందరిని హత్య చేస్తుందో
దప్పిక కత్తులతో ఎందరిని పొడుస్తుందో
చివరిచూపైనా చూస్తామో లేదో!

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!