చీకటి( కరోన)

చీకటి( కరోన)

రచయిత :: యాదగిరి ప్రభాకర్

నల్లటి దట్టమైన కురులతో..
భయోత్పాతం సృష్టించేది..
అడవిలాంటి చీకటి..
కళ్ళున్నవాడు చూడలేడు…
కల్లులేనివాడు చూడలేడు…
చిన్నోడు పెద్ధోడు….
ప్రపంచికరణను పాలించే మొనగాడు…
అందరూ ఆ నల్లని రాజ్యంలో..
ఏక రూప దుస్తువులు ధరించిన విద్యార్థులే…

ఇంద్రధనుస్సులో ఏడు రంగులు…
పేరుకే భిన్నమైన రంగులు..
వాటి అసలు రంగు నలుపు ..అంతా …నలుపు..
భూమి ..ఆకాశం..గాలి..నీరు
మనిషి..అంతా ..శూన్యమే..
చీకటి మాటున ఎన్నో క్షుద్రపూజలు…
తెల్లారకముందే వెలుగును కమ్మేసే కుమ్ములాటలు…
అమ్మడం..కొనడం..అవసరం తప్ప…
మానవత్వం లేని చీకటి రాక్షసత్వం…

కపాలం చీల్చుకొని హిమాలయాల దాకా విస్తరించింది..
దేశాల మధ్య సరి హద్దు గోడల్ని కూల్చింది…
జగమంత చీకటి దుప్పటిని ఎప్పుడో కప్పేసింది…
ఐన… జాగ్రత్త సుమా…
కరచాలనం చేస్తే చీకట్లోకి తోస్తది..
మాస్క్ వేసుకోకుంటే…
మసి చేసి భోంచేస్తది…
కన్ను కొట్టి వెన్నులో..కత్తిపోటు వేస్తది…
నెత్తురు చుక్కరాకుండ మట్టిలో కల్పేస్తది..
అద్దంలో అందంగా నిన్ను చూపి స్మశానాల అంగట్లో అమ్మేస్తది..

తుమ్ముతే తుళ్ళింత…
దగ్గితే దగ్ధమయ్యెంత..
మనిషి భయం ఇపుడు మరణమంత…
రంగు రూపులేని రాక్షసి …
ఎన్నో ఇంటి దీపాలను ఆర్పేస్తున్న చీకటి…
చీకటి…చీకటి..

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!