ముద్దుల ముద్రలు

ముద్దుల ముద్రలు

 

అబ్బబ్బా ఎంత సుఖమో 
ఇది నా వయసు మహిమో
ఎన్నెన్ని ఘాటు ముద్దులో 
పెదవుల చెరగని తీపి ముద్రలో

ముద్దన్న మాటకు అర్ధమే 
నాకు తెలియకున్నా…తెలియని 
తియ్యందనమేదో  అల్లరిగా
మనసున గిలిగింతలు పెడుతోంది 

వద్దన్నా ఇస్తారు ముద్దులెన్నైనా
నేటి నా ఊహ తెలియనినాడు
ఊహ తెలిసి, వయసుకొచ్చిననాడు
ముద్దన్న మాట, నా పెదవి 
దాటీ దాటకుండానే..ఒక్కగుద్దుతో 
నా మూతి పగులగొడతారు

అమ్మ ముద్దుల మాతృత్వపు లాలన
నాన్న ముద్దుల గర్వపు ఆచ్చాదన
నానమ్మ అమ్మమ్మల తాతయ్యల 
ప్రేమల ముద్దుల ముద్రలు పడకున్నా,

ముద్దుకో ముద్రగా..ముద్రకో అనుభూతిగా..
చెరగని గురుతుల ఎన్నెన్ని చెదరని జ్ఞాపకాలో 

కానీ ఎర్రని మూతి కోతిలా..నా మేనత్త పెట్టిన
హక్కు నిండిన హద్దు మీరిన మమకారపు
ముద్దులతో ఎర్రబడి..ఇలా సతమతమౌతున్నా..

        రచన:: సత్య కామఋషి’రుద్ర’

You May Also Like

One thought on “ముద్దుల ముద్రలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!