పాటే నాప్రాణం

పాటే నాప్రాణం

రచయిత ::వి విజయశ్రీదుర్గ

ఊహ వచ్చిన రోజులలో బాలు పాట రేడియో లో నీలాలు కారేనా కాలాలు మారేనా అంటూ వస్తుంటే నన్ను నేనే మైమరచిపోయాను
నిజంగా మన తెలుగుగాయకులలో కవి భావాన్నిసూటిగా పలికె సత్తా బాలూకే
ఎన్నో పాటలు బాలు గళంలో నవరసాలు
పండించెను
తెలుఁగువారికెంతో పేరుప్రఖ్యాతలు తేచ్చేను గాన గంధర్వుడు
క్రమశిక్షణ అంకితభావం సాహిత్యంపై మక్కువ తెలుఁగు భాషపై పట్టు ఇవే మన బాలుఆస్తులు
మంచిస్నేహితుడు గొప్పవక్త మన బాలు
అనేక భాషలలో పాటలుపాడి ఎన్నో అవార్డులు రివార్డులు కైవసం చేసుకొనెను
పద్మభూషణ్ పద్మవిభూషణ్ పద్మశ్రీ
ఒకటేమిటి ఎన్నో బిరుదులు
బాలు చెయ్యలేనిదంటు ఎమిలేదు
బాలు సర్వసమర్దుడు సంగీతసాహిత్యంలో
ఎన్నో కీర్తనలు స్తోత్రాలు భజనలు కూడా పాడెను
సాంబమూర్తి శకుంతలమ్మ గారి
గారలబిడ్డ
గాయని శైలజకి అన్నగా
సావిత్రికి భర్తగా నటుడుసుధాకర్ కి బావగా చరణ్ పల్లవికి తండ్రిగా
నటుడుగా డబ్బింగ్ ఆర్టిస్టుగా
గాయకుడుగా మ్యూజిక్ డైరెక్టర్ గా బహుభాషా కోవిదుడు
కె విశ్వనాధ్ ప్రభుదేవా వెంకటేష్ తొనటించి నటుడుగా భేష్ అనిపించుకొనెను
భార్య పిల్లలు కన్నా పాటే నా ప్రాణం అంటు నలభై వేలపాటలు పాడిన ఘనుడు
ఆదివారం వచ్చిందంటే తెలుగువారిని
టి వి సెట్ల ముందు కట్టిపడేసిన ఘనత
పాడుతాతీయగా స్వరాభిషేకం వంటి కార్యక్రమాలతో ఎన్నో దేశవిదేశాలలో పాటల పూతోట పండించెను
పాడుతా తీయగా ద్వారా ఎందరో క్రొత్త
గాయకులని పరిచయం చేసెను
కరోనా వైరస్ తో బాలు దివి కేగెను
తెలుగువారికెంతో తీరని లోటు
బాలు లేని పాటల పూతోట మనకినాడు
బాలు లేని పాటలపూతోట నిరర్థకమే
పాటగానే మన మధ్య ఉంటానంటూ ఇకసెలవంటూ వెళ్లిపోయెను బాలు మరలిరానిలోకానికి
బాలు లోటు పూడ్చే గాయకుడు రావాలి
ఆనాడే నిజమైన పండుగ మన తెలుగువారికి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!