పాత సాంప్రదాయాలు

 పాత సాంప్రదాయాలు

రచన:: సుజాత  కోకిల 

ప్రేమబంధాలతో  కట్టుకున్న పునాదులపై?, నిలబడ్డ   అందమైన సమష్టి కుటుంబంలో, పుట్టి పెరిగి అదే సమిష్టి కుటుంబంలో  మెట్టినింట అడుగు పెట్టింది. వివాహ బంధంతో, జీవిత మాధుర్యాలను చవిచూసింది అనసూయమ్మ. పాత పద్ధతులను    అలవరుచుకుంది.బంధాలకు,విలువ నిచ్చి కుటుంబ భారాన్ని, చిన్న వయసులోనే  తన భుజాలపై వేసుకొని, ఈ ఇంటి మీద  ఎక్కడలేని మమకారాన్ని పెంచుకుంది.ఆ ఇంటిలో ఆడ దక్షత లేకపోవడంతో, అన్నీ తానై. అందరికీ అనుకూలంగా పాలపొంగులా మెలుగుతూ వచ్చింది.

తన చిన్నమామగారు పోవడంతో,  తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఇంటి భారం, తను మోయాల్సి వచ్చింది. చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలను. మోస్తూ  కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ వచ్చింది.  తను సమిష్టి కుటుంబంలో పెరగడంతో, అంతగా   బాధ అనిపించలేదు. తన పిల్లలతో పాటు చిన్నమామగారి పిల్లలను కూడా, పెంచుతూ వచ్చింది.  తన భర్త మధుసూదన్ గారికి, తగిన ఇల్లాలు అనిపించుకుంది.

ఆ ఊరి వారితో, అనుబంధాలను పెంచుకొని ఉన్నత మనిషిగా పేరు తెచ్చుకున్నది .అందరితో తలలో నాలుకలా ఉంటూ, అందరి మన్ననలను అందుకుంది. ఇంట్లో ముగ్గురు పని మనుషులు ఉన్నారు.  వారితో  చక్కగా మసలుకుంటూ, పనులు చేయించుకుంటుంది.  అమ్మా అమ్మా అంటూ, తన చుట్టే తిరుగుతూ  ఉంటారు. ఇంటినిండా? ధనధాన్యాలు,  పుష్కలంగా ఉన్నాయి.అడిగిన వారికి కాదనకుండా ?కడుపు నింపే, అన్నపూర్ణాదేవి అని పేరు తెచ్చుకుంది.

సంధ్య దీపం పెట్టగానే?  రంగయ్య వచ్చి,  పెరటిలో మంచాలు వాల్చి, వెళ్లిపోగానే  తమ పనులు ముగించుకుని, కబుర్లు చెప్పుకుంటూ పడుకునేవారు.  మధ్యాహ్న వేళల్లో,  మగవాళ్ళంతా వీధి అరుగులపై కబుర్లు చెప్పుకుంటూ,చక్కగా  కాలక్షేపం చేస్తుంటారు.  ఎండాకాలం  తొందరగా, పనులు తెముల్చుకొని గుమ్మడి వడియాలు, చల్లమిరపకాయలు ఇలా చాలా రకాల వడియాలు అందరు? కలిసి, కబుర్లు చెప్పుకుంటూ పెట్టుకుంటారు. ఎండలు బాగా  ఉండటంతో  చెట్లకిందనే ఎక్కువగా  కాలక్షేపం చేస్తుంటారు.

స్వచ్ఛమైన ప్రకృతి అందాలను. ఆస్వాదిస్తూ కల్మషం లేని వాతావరణంలో అందరూ, కలిసి మెలిసి పండగలు జరుపుకుంటారు.  ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. పెళ్లిళ్లు  అయితే,  ఇంటిచుట్టూ మేదరి తడకలతో, పందిళ్లు వేసి దానికి మామిడి తోరణాలు చుట్టి,విద్యుత్ దీపాల అలంకరణ చేసి, వచ్చి పోయే చుట్టాలతో, పెళ్లిఇల్లు, కళకళలాడుతూ ఉండేది. ఇప్పుడు కూడా వసూకి అలాగే చెయ్యాలి,అనుకుంది. “మనసులో “వసూ అంటూ పిలిచింది.ఎంటమ్మ ?చెప్పు అంది.

ఈ సంవత్సరం నీకు, పెళ్లి చేయాలను కొంటున్నాము. తల్లీ ,నీ అభిప్రాయం చెప్పు అంది? నాదేముందమ్మా? మీకిష్టమైతే, నాకు ఇష్టమే అంది. సిగ్గు పడుతూ.   అలాగే తల్లి ?మీ నాన్నతో చెప్తాను. సరే అంటూ,  వెళ్లింది. అక్క బాగున్నావా అంటూ’ సూరి వచ్చాడు. ఇదేనా రావడం?చాలా రోజుల తర్వాత వచ్చావు? అంటూ పలకరించింది. ఇక్కడ పొలం కౌలుకు ఇచ్చాను. నీకు తెలుసుగా అక్క సరిగా వాడు ఏం ఇవ్వడం లేదు?  అదేంటో తెలుసుకుందాం, అని వచ్చాను. ఎలాగూ ఇటు వచ్చాను.కద ?మిమ్మల్ని, చూసి పోదామని వచ్చాను. మంచి పని చేశావురా? అంది.

అటుగా  వసుంధర రావడంతో, అక్క వసూకి పెళ్లి చేస్తావా ?అని అడిగాడు. చేస్తానురా, మంచి సంబంధం ఉంటే చెప్పు.  అలాగే అక్కా ?నువ్వు ఊ అనాలే కానీ,మంచి సంబంధం చూస్తాను.  బావ లేరా, ఇప్పుడే పొలం వైపు వెళ్లారు.వస్తారు లెేరా? వచ్చాక చెప్పుదువుగాని అంది.వసూ ఇలా రామ్మ? మామయ్య వచ్చాడు టీ పట్టుకురా అంది. సరే నంటూ, లోనికి వెళ్ళి టీ పట్టుకుని వచ్చి,తీసుకోండి  మామయ్యా ?అంది.ఏమమ్మా? వసూ, బాగున్నావ  అన్నాడు. ఆ బాగున్నాను మామయ్య?,ఎప్పుడో నిన్ను చిన్నప్పుడు చూశాను తల్లీ నవ్వుతూ, అన్నారు.తను నవ్వుతు,వెళ్లిపోయింది. నీకు  మంచి పెళ్లి సంబంధం చూస్తాను అన్నాడు. పిల్లలకేం తెలుస్తుందిరా? మనం చూడాలి కాని?ఇంకెేం సంగతులు ఇంట్లో వాళ్ళు, ఎలా వున్నారు ? అందరూ బాగున్నారు.

అంతలో మధుసూదనరావు గారు. వచ్చారు.  ఏం సూరిబాబు  బావున్నావా చాలా రోజుల తరవాత,   ఇలా వచ్చావ్? ఏంటి విషయాలంటూ, పలకరించాడు.  పొలం పని మీద ఇటు వచ్చాను. బావ మీ అందర్నీ, చూసి వెళ్దామని వచ్చాను. అన్నాడు.ఏమండి మన వసూకి  పెళ్లిసంబంధం చూడమన్నాను. శుభం మంచి సంబంధం చూడు, అలాగే బావ నేనిక వెళ్ళొస్తాను అన్నాడు. మంచి కబురు తోరా అంది. అనసూయమ్మ ?
ఈ రెండు రోజుల్లో మంచి సంబంధం తీస్కోనొస్తనాను, అంటూ వెళ్లాడు.

ఉదయం లేవగానే  పెళ్లి వారితో  వచ్చాడు.  వారిని చూడగానే అనసూయమ్మ హడావుడి ఇంతా అంతా కాదు ? ఏంటి సూరి చెప్పకుండా తీసుకువచ్చావంటూ గుసగుసగా అంది ?తను కూడా మెల్లిగానే   మన సంబంధం అనగానే ఎగిరి గంతేశారు.ఇంకా నేను ఎం మాట్లాడను?  లేటెందుకు అని వచ్చాము  అమ్మాయిని చూసి, సంబంధం మాకిష్టమె అన్నారు. అన్ని విషయాల్లో తమకు తగిన సంబంధమే అనుకోని, ఒప్పుకున్నారు.వసూను అడిగింది నీ కిష్టమేనా ?అంటూ మీకు  ఇష్టమైతే నాకిష్టమే అంది. సరే  తల్లి చాలా సంతోషం. నీకు కష్టమయ్యే ఏ పని  చెయ్యను, తల్లీ ?అంది. దగ్గరకు తీసుకుంటూ, సాంప్రదాయ పద్ధతిలో  అంగరంగ వైభవంగా పందిళ్లు వేసి  అందరూ వేనోళ్ల పొగిడేలా పెళ్లి చేసింది.  సక్రమమైన పద్ధతిలో తన బాధ్యతలను నెరవేర్చుకుంది. మిగతా  బాధ్యతలను పిల్లలకు అప్పగించింది.  ఇంకా  అలిసిన శరీరాలు సుఖసంతోషాల మధ్యలో తనువు చాలించారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని బంధువులు “ఆశించారు”.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!