మరచిపోలేని రోజు

మరచిపోలేని రోజు

దోసపాటి వెంకటరామచంద్రరావు

శ్రీధర్ అమెరికాలో ఎమ్ ఎస్ చేసి అక్కడే ఒక పెద్ద సాఫ్టవేర్ కంపెనిలో ఉద్యోగం చేస్తున్నాడు.అదే కంపెనిలో పనిచేస్తున్న పంజాబి అమ్మాయిని పెళ్ళి చేసేసుకున్నాడు. ఇండియాలో తన తల్లిదండ్రలకుమాత్రం చెప్పలేదు. చెప్పడానికి తను వాళ్ళ దృష్టిలో లేనివాడు. భార్య తల్లిదండ్రులకు చెప్పారు. వాళ్ళేమి
అభ్యంతరం చెప్పలేదు. వీడియోలోనే వాళ్ళని దీవించేశారు. అయినా శ్రీధర్ మనసులో ఎదో వెలితి.
ఒక్కసారి తన ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి.

“శ్రీధర్ !లే!లే! ఈరోజు నీ పరీక్షాఫలితాలు వచ్చేరోజు. లేచి వేగంగా తయారవు.ఫలితాలు చూసుకొని గుడికి వెళ్ళి అర్చన చేయించాలి.
“కమలాబాయ్
కొడుకు శ్రీధర్ ని లేపించింది.శ్రీధర్ బద్దకంగా ఒళ్ళు విరుచుకొని లేచి వాష్ రూమ్ లో దూరాడు.
శ్రీధర్ ఇంటర్ చదువుతున్నప్పుడే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అతనొక గెజిటెడ్ హోదాలో ప్రభుత్వ ఉద్యోగి.శ్రీధర్ వాళ్ళ అమ్మ కమలాబాయ్ జూనియర్
లెక్చరర్ గా చేస్తోంది.ఒక్కడే కొడుకు కావడంతో
కొంచెం ముద్దుగానే పెరిగాడు.తనకు కావలసినవన్నీ
సమకూర్ఛేవారు.శ్రీధర్ వాళ్ళనాన్న శ్రీధర్నీ అమెరికా
పంపాలని కొడుకు ని బాగా చదవమని ప్రోత్సహిస్తుండేవాడు.అందుకే కమలాబాయ్
భర్త చనిపోయేక వచ్చిన డబ్బంతా వాడి పేర్నే బ్యాంకులో ఫిక్షడ్ చేసేసింది.
శ్రీధర్ స్నానపానాదులు చేసేసి తన లేప్టాటు తెరచి
పరీక్షఫలితాలు చూశాడు.కొంచెంసేపు
తల్లిని కంగారు పెట్టడానికి విచారవదనంతో కూర్చున్నాడు.కమలాబాయ్ కొడుకు వాలకం చూసి
అడిగింది ఏమైందని.శ్రీధర్ ఏమి చెప్పకుండా
మౌనం వహించాడు.ఈలోగా కమలాబాయ్ ఫోను
రింగైంది.తన తోటి ఉద్యోగినుంచి”కంగ్రాట్స్ కమలా!మీవాడు సెకెండ్ ర్యాంకులో పాసయ్యాడు.సాయంత్రం
ట్రీట్ ఇవ్వాలి.మనవాళ్ళందరిని పోగేసుకొని వస్తున్నా”
అంటూ చేప్పేసింది.
కమలాబాయ్ శ్రీధర్ చెవులు మెలేసింది తనకా విషయం చెప్పనందుకు.
ఇద్దరూ గుడికి వెళ్ళి అర్చన చేయించుకొచ్చారు.
సాయంత్రం కమలాబాయ్ తన సహచరులకు
ట్రీట్ ఇచ్చింది.శ్రీధర్ తన స్నేహితులకు ట్రీట్ ఇవ్వాలని
బయటకెళ్ళిపోయాడు.ఇంతవరకు కధ సుఖాంతమే.
శ్రీధర్ అమెరికా ప్రయాణనం గురించి మాటలాడడానికి శ్రీధర్ ని పిలిచింది.శ్రీధర్ ని అడిగింది.శ్రీధర్ తను అమెరికా వెళ్ళనన్నాడు.తన తండ్రి కల గురించి చెప్పింది.ససేమిరా కాదన్నాడు.తనని ఒక్కర్తిని విడిచి వెళ్ళనని గొడవపెట్టాడు.వెళ్ళక తప్పదని కమలాబాయ్ పట్ట పట్టింది.ఒక వారంరోజులవరకు
తల్లి కొడుకులు మాట్లాడు కోలేదు. ఈ రోజెలాగైనా ఆ విషయం తేల్చాలని శ్రీధర్ తో గొడవపడింది.శ్రీధర్ తన పట్టు విడవలేదు.కమలాబాయ్ ఆవేశంలో కొడుకు చెంపలు వాయించింది.శ్రీధర్ అహం దెబ్బతింది. అక్కడ్నించి
విసురుగా బయటకు వెళ్ళిపోయాడు.తను తన బింకం వదలక తన గదిలోకి వెళ్ళి పోయింది. మర్నాడు ఉదయం శ్రీధర్ గదిలొకి వెళ్ళి లేచేడేమో నని చూడడానికి వెళ్ళింది.గదిలో లేడు.టేబుల్ మీద ఉత్తరం పేట్టేసివుంది.తన గురించి ఆలోచించవద్దని రాసివుంది.అలా ఇంట్లోంచి అమ్మకు చెప్పకుండా
వెళ్ళిపోయాడు శ్రీధర్.అలా వెళ్ళి తండ్రి కోరిక తీర్చుదామనుకున్నాడు.కాని కమలాబయ్ మాత్రం
కొడుకు అలా చేసినందుకు క్షమించలేకపొయింది.శ్రీధర్
ఫోన్లు చేసినా తీసేది కాదు.మెయిల్స్ పెట్టినా చూసేది
కాదు.చివరికి ఖచ్చితంగా చెప్పేసింది తనకు ఎలాంటి
సంబంధంలేదని చెప్పెసింది.ఇక చేసేదిలేక శ్రీధర్ తనలోనే మదనపడసాగేడు.ఈలోగా భార్య పిలవడంతో ఈలోకంలోకి వచ్చాడు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!