ఒకే చెట్టుకు పూసిన పువ్వులం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: సుజాత కోకిల
గులాబి చెట్టుకు ముళ్లు ఉన్న! గులాబీ పువ్వు ఎంతో అందంగా కనబడుతుంది. అవే చెట్లు సమూహంలా ఏర్పడినప్పుడు వాటికి పూసిన పూలను చూస్తుంటే ఎంతో అందంగా ఇంకా ఇంకా చూడాలనిపించేలా మనసుకు అనిపిస్తుంది . అలాగే మన కుటుంబాలు కూడా అలా సమిష్టిగా కలిసి ఉంటే ఆ కుటుంబాలు కూడా చూడముచ్చటగా కనిపిస్తాయి. మనవళ్లు మనవరాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వాళ్లకి బోరు కొట్టకుండా ఆనందంగా ఉంటారు.
పిల్లలను మంచిగా చూసుకుంటారు. పిల్లలకు కూడా ఆనందంగా ఉంటుంది.మంచి చెడ్డలను పంచుకుంటూ ఓర్పుగానేర్పుగా మసులుకొంటూ సంతోషాలతో ఉండెేవెే సమష్టి కుటుంబాలు! ఆ కుటుంబంలో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా అందరూ పంచుకుంటారు. మంచి చెడులు ఏర్పడినప్పుడు గులాబీ ముల్లులా గుచ్చుకున్నా ఆ గాయం మానిన తర్వాత మళ్లీ కొత్త సంతోషాలతో ఆనందంగా ఉంటారు.
అమ్మమ్మ తాత చెప్పే కబుర్లు కథలు వింటూ అమ్మ నాన్నలు మనల్ని కోప్పడినప్పుడు. అలిగి నాన్నమ్మ తాతతో చెప్పినప్పుడు అమ్మనాన్నలను. మందలించినప్పుడు మనం ఏదో సాధించాం అనెే సంతోషం. పిల్లల కళ్ళల్లో కనబడుతుంది. అప్పుడు నానమ్మ తాతలు బుజ్జగించి చిన్న చిన్న కథలు చెప్తున్నప్పుడు పిల్లల మొహాల్లో ఆనందం కనబడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్వార్థాలు పేరుకుపోయి సమిష్టి కుటుంబాలే లేకుండా పోయినాయి. నీనా అన్న తేడాలతో ఎవరికి వారే అన్నట్టుగా జీవచ్చంలా బ్రతికేస్తున్నారు. మన ముందు తరాల పిల్లలకి సమిష్టి కుటుంబాలు అంటేనే తెలియవు మన వెనుక తరాల వారు ఎంతో మంది పిల్లలకు జన్మనిచ్చారు.అయినా వారు ఎంతో సంతోషంగా ఉన్నారు.
అప్పుడు అoత సంపాదన కూడా లేదు అయిన వారు చాలా సంతోషంగా ఉండేవారు.నానమ్మ తాత అత్తయ్యలు మామయ్యలు పిన్ని బాబాయిలతో సరదా సరదాగా సంతోషంగా కలో గంజో తినుకుంటూ సంతోషంగా ఉండేవారు.
ఇప్పుడు అలా కాదు ఒకరు ముద్దు రెండు వద్దు అనుకుంటూ జీవితాలకు సంతోషాలు లేకుండా చేసుకుంటున్నారు. ఇదేనేమో కాలవైపరీత్యం అంటే ఇంత మాత్రానికే ఎంతో కష్టపడుతున్నామని అనుకుంటూ ఇదే మా జీవితం ఇందులోనే మా సంతోషం అంతా అనుకుంటూ భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ ఒక్కఇంట్లోనే ఉంటూ రాత్రి ఎప్పుడో గాని కలుసుకొరు! ఆ ఒక్క పిల్లవాణ్ణి కూడా సరిగా చూసుకోరు? మనకు తోడంటూ బేబీ సెంటర్లు కూడా వచ్చాయి.బయట వారిని నమ్మినట్టుగా మన ఇంట్లో వాళ్లని నమ్మరు.
ప్రైవసీ కావాలని స్వేచ్ఛగా ఉండాలి అనుకుంటూ చిన్న ఫ్యామిలీగా ఏర్పడి ఇప్పుడు ఎవరికి వారే విడిపోయి బయటకు వెళ్లి బ్రతికేస్తున్నారు. బయట పిల్లలకు లక్షలకు లక్షలు ఖర్చు పెడుతున్నారు. కానీ మనఇంట్లో వాళ్లతో మంచిగా ఉండరు వుంటే మనకెంతో మంచిదని అనుకోరు.మనకు రక్షణగా ఉంటూ మన బాగోగులను చూసుకుంటారని అనుకోరు అలా అమ్మమ్మ తాతయ్యలకు అప్పగించరు.మేమే అన్ని చేసుకుంటాము అనే ఫీలింగ్ ఇంకా పెద్దవాళ్లని సంతోషపరుస్తూ నీ నా అన్న తేడా లేకుండా మనమంతా ఒకే కుటుంబం అనుకోని ఉన్న దాంట్లో తలాబుక్కెడు తిని వారిని సంతోషపెడుతూ మనం ఆనందంగా ఉండొచ్చు కానీ అలా చెయ్యరు వాళ్లు ఇబ్బంది పడుతూ మన వాళ్లని ఇబ్బంది పెడుతూ వాళ్లు ఇబ్బంది పడుతున్నారు.ఇబ్బంది పడుతున్నామని వాళ్లకి ఇంకా అర్థం కావడం లేదు.
పండుగలు వచ్చాయంటే ఇళ్లంతా సందడి పిల్లల కేరింతలతో ఇళ్లంతా కళకళలాడుతుoది.పెద్దవాళ్ళకు పిండివంటలతో ఒకటే హడావుడి ఉంటుంది. స్నేహితులమంతా ఒకేచోట చేరి పొలం గట్లపై నడుస్తూ కబుర్లు చెప్పుకుంటూ పేసర్ కాయలు కంది కాయలు కోసుకుని.తింటుంటే అప్పటి ఆ ఆనందలెే వేరు సంక్రాంతి వచ్చిందంటే ఒకటే హడావుడి రేగుపండ్ల చెట్లు ఎక్కి రేగుపండ్లు కోసుకుని పొలాల గట్లపై అల్లరి చేసుకుంటూ నడుస్తుంటే ఆ సంతోషాలు సరదాలు చాలా ఆనందాన్నిచ్చేవి ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు గొబ్బెమ్మలు హరిదాసుల కీర్తనలు ఎన్నో ఉండేవి ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు ఇప్పుడుంటే గా ఇప్పుడు గడుపుతున్న క్షణం మాత్రమే మనది మళ్ళీ రేపు ఏంటో ఎవరికీ తెలియదు.బంధాలు లెేేవు బంధుత్వాలు అంటే ఏంటో తెలియదు ప్రేమలు అసలే లేవు కలిసి ఉంటేనే కలదు సుఖం మనం చెప్తే వినని విషయాలు అమ్మమ్మ తాతయ్యలు చెప్తే విని అర్థం చేసుకుంటారు.ఎక్కడ ఉన్న మన విలువలను మన ప్రేమలను మన బంధాలను సాంప్రదాయాలను మర్చిపోవద్దు మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు. అందుకే మన ఉండేవరకు బంధాన్ని ఒడిసిపట్టుకుందాం ఎప్పుడు జారవిడుచుకోవద్దు ఇది ఎప్పటికీ మర్చిపోద్ధు