తనప్రేమ

తనప్రేమ

రచన::జయకుమారి

ప్రేమకు అర్ధం తెలియదు నాకు తన ప్రేమలో నను నేను మర్చిపోయేవరకు.

ఎదురుచూపు అంటే తెలియదు నాకు
తన కోసం ఎదురుచూస్తూ క్షణం ఒక యుగముగా గడిపేవరకు.

పరవశం అంటే తెలియదు నాకు
నా ఊపిరి తన ఊపిరి తో కలిసి చేసే ప్రతి చిలిపిఅల్లరి నాలో తెలియని వింత పరవశం కలిగేవరకు.
ఆకలి అంటే తెలియదు నాకు ,
తన మాటలతోనే గోరుముద్దలు తినిపించే వరకు.
జీవితం అంటే తెలియదు నాకు
తన పరిచయంలో  ప్రతిక్షణం కొత్త గా జన్మిస్తూనే ఉన్నా అని తెలిసే వరకు.

కన్నా నీతో గడిపిన ప్రతిక్షణం, ప్రతినిముషం నాకో ప్రియవరమే,
మరుపురాని ప్రేమకావ్యమే.
ఓ తీయ్యని అనుభవమే.
నిను నాలో దాచేసుకొని.
నా నువ్వు నీ నేను
మనం గా మారి
మరో ప్రేమ లోకం సృష్టిద్దమా..

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!