ఎదురుచూపులు

ఎదురుచూపులు

రచన: బండి చందు

నా దేశపు విజ్ఞాన భాండాగారంలో
ప్రతీ విద్యార్థి ఒక ప్రయోగశాలే
అలనాటి విద్య అమృతతుల్యమై
నేటి విద్య కత్తి మీద సామైనది
నాడేందరో మేధావులకు కొలువైన
నా దేశం నేటి విద్యని పుణికి పుచ్చుకునే
పుత్రుల కనలేక అల్లాడిపోతున్నది
నేడు నా దేశ విద్యా వ్యవస్థ
విభజితమై వీధి పాలవుతున్నది
ఒకప్పటి పాఠనాభిలాశ పాతబడిపోయినది
జాతీయత జాగరుకత లేక జాగిలపడినది
సహనం లేని సంస్కరణలు సన్నగిల్లినవి
మానినై మరణించక మరుగునపడుతున్నవి
నిత్యం వేద మంత్రాలతో
విరాజిల్లిన గురుకులాలు నేడు
గుండె పగిలి రోధిస్తున్నవి
బతకలేక బడిపంతులన్న
సామెత సత్యమనిపిస్తున్నది
ఇంకెన్ని రోజుల ఎదురుచూపులో
కాలం తిరగరాసే చరిత్ర చదవడానికి
నూతన విద్యా విధాన అమలుకి…

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!