దెయ్యాల గృహలు

దెయ్యాల గృహలు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: యాంబాకం

పూర్వం గరుడ పర్వతాలకు పడమటగా దండకారణ్యం ఉండేది. అక్కడ కూర జంతువులు దారిన పోయే బాటసారులను వాటికి ఆహారం గా మారి కోరికలు తీరక దెయ్యాలు గా పిశాచాలు గా, కొరివ దెయ్యాలుగా మారి అక్కడే గృహలో నివసిస్తూ ఉన్నాయని మనుషుల నమ్మకం. అందుకే కొత్త వారు ఒంటరి గా దండకార్యణ్యంలోకి పోవడం మానేశారు. అదిగాక అవి ప్రయాణికులను, పీడించి చంపి తింటూ వారి వెంట ఉండే ధనాన్ని నగలు గృహంలో దాచిపెడుతూ ఉండేవి.

దెయ్యాలు ఉండే గృహలకు అడవి సమీపంలో ఒక ఊరు అందులో ఒక చాకలి ఉండేవాడు. వాడు పేదవాడే గాని కాస్త తెలివి,చిన్నపాటి సాహసము కలవాడు. పట్ట పగలు దెయ్యాలు తిరగవనీ నిద్రపోతాయనీ వాడికి ఒకసారి వాడి అవ్వ చెప్పగా గుర్తు పెట్టుకుని ఉన్నాడు.

వాడు ఒక రోజు బట్టలు ఎత్తుకుని యేటికి పోతుండగా ఓక వడ్రంగి కట్టేలు కోసం అటు పోతూ “చాకలి ఈ ఊరికి పడమట దిక్కున దెయ్యాల గృహ ఉంది. వాటి గృహ లో చాల డబ్బులు నగలు కూడ పెట్టి ఉన్నాయట అని చెప్పగా అంతే కాదు, అటువైపు తిరిగేవారిని చంపి వారి దగ్గర ఉండే వస్తువులను తీసుకెళ్లి గృహలో ఉంచుతాయట అని చెప్పి పక్కదారికి వెళ్ళి పోయాడు.ఇక చాకలి ఆ గృహలో ఎలాగైనా! దెయ్యాల భరతం పెట్టి ధనము ఆభరణాలు దొరుకుతామేమో చూడాలని చాకలి కి ఆలోచన తట్టింది.

ఒకరోజు చాకలి యేటికి పోకుండా తన మోచ్చుకత్తి చంకన పెట్టుకొని ఎందకైనా మంచిదని చాకలి తలపాగా ను చేతపట్టుకొని అరణ్యంలో ప్రవేశించాడు. కొంత దూరం వెళ్ళేసరికి అలసి ఒక పొదలచాటు నీడలో నిద్రపోయాడు. కాస్త చీకటి పడింది. ఇంతలో పోదలచాటు నుంచి శబ్దం రాగా చాకలి మెళుకువరాగా కళ్లు తెరచి చూడగా ఒక దెయ్యం ఎదురు వచ్చింది.

తెలివిగా చాకలి దానిని చూసి బెదరక తలపాగా పెట్టుకొని. “ఆహా!దొరికినా? నీ కోసమే చేస్తున్నాను. భయపడకు,నిను చంపనులే నీ కోరలు,జుట్టు,మీసాలు కావాలి,లే అవి మాత్రమే తీసుకుని పోతాను. అవి చూపిస్తే మాఊరి రెడ్డి నాకు బహుమానం ఇస్తాడు. అని చాలా మంచిగా అన్నాడు.

దెయ్యం హడలిపోయింది. “బాబు, నన్ను ఆపని మాత్రం చేయక మా మంత్రాలన్ని బేతాలుడు మీసం లో జట్టు లోనే పెట్టాడు.రెడ్డి ఇచ్చే బహుమానం ఏదో నేనే ఇచ్చుకొంటాను. అని అది ప్రాధేయపడింది.

“చాకలి ఇదే సమయం అని “పోనీ, నువ్వంత గా అడుగుతున్నావు గనుక” నీ ఇష్టం ప్రకారంమే కానీ”అన్నాడు.చాకలి,చాకలిని దెయ్యం ఒక గృహలోనికి తీసుకుపోయి ఒక డబ్బు సంచి చూపించింది. చాకలి ఆ సంచి తీసుకొని తన దారిన తాను ఇంటికి వచ్చేశాడు.

చాకలి సంచి విప్పి అందులో ఉన్న ధనం నగలు లెక్క చూసుకుంటుండగా,పక్కనే వడ్రంగి చూసి అరే! ఇంత ధనం ఎక్కడది. అని అడిగాడు.తను జరిగినదంతా చెప్పగా తాను కూడా దెయ్యలను బెదిరించి డబ్బు సంపాదించుకొవాలని మర్నాడు. వాడు గండ్రగొడలి తీసుకొని అడవికి వెళ్ళాడు. దట్టమైన అడవి ప్రాంతంలో కి వెళ్లాక వాడికి మిట్ట మధ్యాహ్నం అగుటచేత సుడిగాలి తో ఒక ముసలి పిశాచి కనిపించింది. అది రావడం ఒక వికారపు అరుపు చేయడం వడ్రంగి విన్నాడు. ఈ… హిక్… హీ.. అంటూ రావడంతో వడ్రంగి కాస్త బెదరి బెదరినట్టు “అమ్మాయ్య దొరికావా!

కాస్త నిలబడు!క్షణంలో నీతల నరికి బేతాలుడి కి నైవేద్యం పడతా, నాకు పెద్ద బహుమానం దొరుకుతుంది “అంటూ గొడలి ఎత్తి పిశాచి మీద కి దూకాడు పిశాచి ముసలి కాబట్టి హాడలి పోయింది.

“బాబూ నా ప్రాణం కాపాడు బేతాలుడు ఇచ్చే ఆబహుమతి రెండింతలు నేనే ఇచ్చు కుంటాను!”అన్నది పిశాచి.

“ఏది ఏ మాత్రం ఇస్తావో చూస్తాను! పద అన్నాడు వడ్రంగి

పిశాచి వాన్ని తన గృహకు తీసుకుపోయి అంతులేని బంగారు నగలు చూపింది. వడ్రంగి వాటిని మూటకట్టకొని ఇంటికి వచ్చేవాడు.

ఈ సంగతి తెలియగానే చాకలి కి మళ్ళీ ఆశపుట్టింది. వాడు వడ్రంగి తో “మామా మనం ఒక్కొక్క దెయ్యాని,పిశాచిని,బెదించి లాభంలేదు. అడవిలోని అన్ని దెయ్యాలను హడలి గొట్టామంటే ఏడుతరాలపాటు మన దరిద్రం తీరిపోతుంది.ఏమంటావు?అన్నాడు.

వడ్రంగి చాకలి అంత సాహసికాడు. అందుకే మొదట కాస్త వెనక్కి తగ్గి,చాకలి ప్రోత్సాహం తో సరే అని ఒప్పుకొన్నాడు. ఇద్దరు కలిసి అడవిలో చాలా దూరం వెళ్ళి పేద్ద చేట్టెక్కి దెయ్యాలు ఉండే గృహలు కనిపిస్తాయేమోనని చూడసాగారు.

ఈ లోగా అడవి లోని దెయ్యాలన్ని కలసి ఒక సభ ఏర్పాటు చేశారు. వరుసగా రెండు రోజులు ఇద్దరు మానవులు మన లోని రెండు దెయ్యాలను బెదిరించి ధనం బంగారు నగలు కాజేశారు.

” మనకు మన ఆహారమైన మానవులు బెదిరించటమా! మనుషుల తో పోలిస్తే మనం ఎంత బలశాలులం! ఎంత భయంకరులం!” అని వయసులో వున్న దెయ్యాలు హూంకరించాయి, కొరివి దెయ్యాలు పురితల వెసుకొని నెత్తిన కాగడాలు పెట్టుకొని హ్హ్ హ్హ్.. ..హీ.. అంటూ చుట్టూ తిరిగ సాగాయి. ఇది చెట్టు పైన ఉన్న చాకలి కి వడ్రంగి,కి కనపడ గా,ఇద్దరూ గుస,గుస లాడుకొన్నారు. కాని” ఒక ముసలి దెయ్యం ఈ విధంగా హెచ్చరించింది.

“నాయన లారా! సృష్ఠలో మనమే , భయం కరత్వమూ గలవాళ్ళ మని ఒక్క నాటికి అనుకో కండి.ధనాసలోబడిన మనిషి కంటే కూరమైన,భయంకరమైన జంతువు సృష్టి లో లేదు. కనుక ఇక ముందు నుంచి మనం ఒంటరిగా తిరగ కూడదు. మందలు మందలు గా తిరగాలి ఐకమత్యమే మనకుబలం”.అని సభ తీర్మన్నించుకొన్నాయి.

సమావేశం పూర్తి కాగానే దెయ్యలన్ని కదలి చాకలి వడ్రంగి వున్న వైపుగా రాసాగాయి. అన్ని దెయ్యాలను ఒక్కసారి చూడగానే వడ్రంగి కి వొళ్ళుంత చమటలు పడగా చేతులు పట్టుతప్పి వాడు చెట్టకొమ్మ మీద నుండి కిందికి పడసాగాడు. ఆ సమయంలో చాకలి వాడు ఎంతో తెలివిగా పట్టుకో! దెయ్యాలన్నిటిని పట్టుకో, ఒక్కదాన్నికూడ పోనీమాకు! అని గొంతెత్తి బీకరంగా అరిచాడు.

ఆ అరుపులు విరిగిన కొమ్మలను పట్టుకొని కిందదూకే మనిషిని చూసి దెయ్యాలు పూర్తిగా బెదరి దిక్కు తొచక తలకొకదారిగా బలం కొద్ది పారిపోయినట్లు చాటున దాగాయి.తరువాత చాకలి చెట్టు దిగి వచ్చాడు. ఇద్దరూ బయలు దేరి “దెయ్యాల గృహలకు చేరుకొని దాచిన ధనం, నగలు కొల్లగొట్టు సమయాన దెయ్యాలు లు చాకలిని,వండ్రంగిని తరమ సాగాయి,దెయ్యాలు వెనుక చాకలి వడ్రంగిని తరమగా, , ఒకటే పరుగు,పరుగు ఒకటి కాదు రెండు కాదు నాలుగు యోజనాలు అటు ఇటు వంగా టింకరగా నాన హింస దెయ్యాలను వాళ్ళు,వాళ్ళను దెయ్యాలు ఇలా పరుగెత్తి పరిగెతి దెయ్యాలు,చాకలి,వడ్రంగి,అందరూ వచ్చి ఒక పెద్ద పెద్ద బండరాయి మీదకు చెరి కూలబడ్డారు. ఇంతలో ఒక బుడత దెయ్యం అమ్మా ఆకలి అని గుర్తు చేసింది. అంతే అమ్మ దెయ్యం కాసేపు ఒర్చుకో నాన ఇద్దరి ని వండి పెడతానని సముదాయించింది.

ఇంతలో ఆ కొండపై ఆంజనేయ స్వామి గుడి కనింపించగా చాకలికి ఒక ఉపాయం తట్టింది. వడ్రంగి తో సైగచేసి ఇదిగో దెయ్యాలు మీరు ఎంత మంది ఉన్నా అందరి తలలు నరికేస్తాను అని దెయ్యాలతో సవాల్ విసరగా దెయ్యాలు మరలా తరమ సాగాయి.

ఇది తరునోపాయం గా చాకలి వడ్రంగి గుడిలో దూరి తలుపు వేసుకున్నారు. కొన్ని దెయ్యాలు తొందర పడి లోనికి పోబోతుండగా, ముసలి దైయం వారిని ఆపి ఒరేయ్!ఇది ఆంజనేయ స్వామి గుడి రా ఆయన మన దెయ్యాలకు అధిపతి రో పోకండి ఆచాటున దాగి వారు బయటకు రాగానే లటుక్ న పట్టు కొని లటుక్ అని తిందాము. అని దెయ్యాలన్ని బయట కూర్చుని తీరికగా పెలు చూసు కొసాగాయి.

ఒక జాము రెండ జాము మూడవ జాము కూడా దాటుతుండగా,మరల బుడత దెయ్యాలు అమ్మా ఆకలి అని కేకలు వేయడంతో దెయ్యాలు లు కాస్త మేలు కొన్నాయి.గుడిలో కి పోయిన చాకలి వడ్రంగి ఆంజనేయ స్వామికి పూజచేసి హారతి ఇచ్చి స్వామి ఆ దెయ్యాలను తరమగొట్టే ధైర్యం ఇవ్వ స్వామీ అని అడిగారు. ఇంతలో ఒక దైవ కంఠస్వరంతో ఇచ్చాను నాయన తీసుకోండి ఇక మీకు తిరుగు లేదు. మీకు నా శక్తి మొత్తం వచ్చేసినట్లే అని విగ్రహం వెనుక రోజు రాత్రి నిద్ర పోయే దొంగ సన్యాసి పలుకగా నిజంగా నే స్వామి స్వయంగా పలికినట్లు ఊహించుకొని చాకలి వడ్రంగి బయటకు రాగానే మళ్ళీ దెయ్యాలు తరమ సాగాయి ఎక్కడ లేని దైర్యం తో చాకలి వడ్రంగి దెయ్యలతో పోట్లాట కు సిద్ధం అయినారు. చాకలి వడ్రంగి కి
ఇంత దైర్యం ఏలా వచిందని దెయ్యాలు ఆశ్చర్యంగా అడగగ ఇది ఆంజనేయ స్వామి ఇచ్చిన వరం ఇక మీకు చావుతప్పదు,అని చాకలి గట్టిగా మాట్లాడటంతో ఒక ఒప్పందం చెసుకొందామన్నాడు చాకలి దెయ్యాలు ఒప్పకొన్నాయి. చూడండి దెయ్యాలు మాఇద్దరి వెంట్రుకలను ఎవడైతే చక్కగా నిపెడితే ఇద్దరిని తినవచ్చు లేదంటే నాచేతిలో మీకు చావు కాయం అని హెచరించాడు.

దెయ్యాలు ఇద్దరి తల లోనించి తాల ఒక ఎంట్రుక పీకి నిలపెట్టే ప్రయత్నంలోపడ్డాయి ఎంట్రుకని పైకి అన్ను పడిపోను, తలకిందకి పైకి ఇలా చేసి చేసి దెయ్యాల మెడ పట్టుకొని పోగా సోమ్మసిల్లి పడిపోయి మానవులకు దండాలు బాబోయ్ మమ్మల్ని వదిలి పడితే మా గృహలో ఉన్న డబ్బు నగలు ఇచ్చి మేము ఈ అడవి ని వదిలి వెళ్ళి పోతామని మాట ఈయగా చాకలి వడ్రంగి సంతోషంగా ఉప్పుకొన్నారు.

“దెయ్యాలు గృహలో ఉన్న డబ్బు బంగారు నగలు చాకలికి వడ్రంగి కి ఇచ్చి మాట ప్రకారం గృహను వదలి దెయ్యాలు వెళ్ళి పోయాయి. చాకలి వడ్రంగి ఆ ఊరిలో గొప్ప ధనికులైపోయారు.

*********

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!