ఇంకేన్నాళ్ళీబానిసత్వం

(అంశం:”బానిససంకెళ్లు”)

ఇంకేన్నాళ్ళీబానిసత్వం

రచన: శృంగవరపు శాంతికుమారి

ఓ మనిషీ
నిన్ను వీడి పోదా
ఎన్నటికీబానిసబ్రతుకు
సంఘజీవినంటావు
స్వేచ్ఛ స్వతంత్రాలకై
ఉద్యమాలు,పోరాటలు చేస్తావు
పస్తులుంటావు,ప్రాణాలే త్యాగం చేస్తావు
రెక్కాడితే గాని డొక్కాడదు
వంగివంగి దండాలు పెడితేగాని
రోజువారీ కూలి దొరకదు
పరాయి పాలన పోయినా
బానిసత్వం పోరు పోలేదు
బానిస సంకెళ్ళ నుండి
విముక్తి కలగలేదు
పేదరికం ఆశలను,ఆశయాలను
చెల్లాచెదురు చేస్తుంటే
జానెడు పొట్టకూటికై
పెత్తందారుల,ధనవంతుల
పంచనచేరి
జీవితాంతం ఊడిగం చేసినా నిన్ను ఆకటి చిచ్చు దహిస్తూనే ఉంటుంది
శిక్షలు,కక్షలు,కుట్రలు,కుతంత్రాలు,మోసాలు,దాడులు,దోపిడీలు
నడుమ జీవనం నలిగిపోతూనే ఉంటుంది
ఇంకెన్నాళ్ళీబానిసత్వం!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!