” నువ్వే నా శ్వాస ”
నా ఆలోచనలకు ఆచరణ నువ్వు
నా భావాలకు అక్షరరూపం నువ్వు
నా సంతోషానికి వారధి నువ్వు
నా బాధలకు ఓదార్పు నువ్వు
నా ఒంటరితనానికి తోడు నువ్వు
నా మౌనానికి మాట నేర్పింది నువ్వు
నా ఆవేశానికి ఆలోచన జత చేసింది నువ్వు
నా కోపానికి విలువ ఉండేలా చూసింది నువ్వు
నా ఏకాంతానికి స్నేహం నువ్వు
నా తప్పులను సరిదిద్దే గురువు నువ్వు
నా విజయానికి కారణం నువ్వు
నా చిలిపి అల్లరికి ప్రతీకగా నిలిచింది నువ్వు
నా దేహానికి శ్వాసగా ఉంటుంది నువ్వు
నేను నేనే నా అని ఆలోచిస్తే కాదు
మొత్తంగా నువ్వే అయ్యానని నా మనసు చెబుతోంది బంగారం
రచన: ఇత్నార్క్