నిశబ్దం

నిశబ్దం…

ఒక మనిషిని తనలో కలిపేసుకోగలదు

ఒక మనసుని మధించగలదు

ఎన్నో సార్లు నవ్విన

నీ నవ్వులన్ని తనలో దాచేసుకోగలదు

నీలో దాగిన నీతో యుద్దం 

చేయించగలదు

కనిపించే కల్మషాలన్నీ కాలం కౌగిట్లో

కరిగి పోతాయని  ఓదార్చగలదు

ఎవ్వరూ లేని సమయాన

స్నేహాన్ని చూపగలదు

అందరూ వున్న సమయాన

ఆందోళన ఆపగలదు

నిశబ్దం

నిన్ను వదలని నీకే ఇంకో రూపం

ఒక్కసారి నిశబ్ధాన్ని

ప్రేమించి చూడు…

లోకంలో ఏది నచ్చనంత

గొప్పగా నీకు నచ్చేస్తుంది.

                                     రచన: స్వప్న ప్రియ

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!