కౌముది

కౌముది

రచన:: డా. బాలాజీ దీక్షితులు పి.వి

వెన్నెల కానుకిస్తా
పున్నమి రేయి కలువు అన్నావు

అధరపు దీపం వెలిగిస్తా…బుగ్గలపై
అమవాస్య దాకా ఆగు అన్నావు

కన్నెగీతాలు ఆలపిస్తా
మధుమాసం రానీ అన్నావు

సోయగ తళుకులు వలచిస్తా
హిమధుని రేగనీ అన్నావు

వలపుల కౌగిలిలో బంధిస్తా
ఆమని పూయనీ అన్నావు

కరిగే క్షణాల చుట్టూ భావ ప్రదక్షిణ చేయిస్తున్నావు
ఋతువుల రంగులతో మాయచేస్తున్నావు

కలల కౌముది
ఎక్కడ నీ చిరునామా.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!