సంస్కరణల పితామహుడు పి.వి

సంస్కరణల పితామహుడు పి.వి

రచన:: పిల్లి హజరత్తయ్య

రుక్మాబాయమ్మ,సీతారామారావుల ముద్దుల తనయునిగా
దేశభక్తి లక్షణ సమన్వితునిగా
మిన్ను విరిగి మీద పడ్డా చలించకుండా
దేశం కోసం పరితపించిన మహోన్నతుడు పివి

రాజకీయంగా ఎలాంటి బలము లేకుండా
రాజకీయ చతురతను ప్రదర్శించి
రాజకీయాలను ఏలిన
ఉదాత్త దేశభక్తి రాజకీయ నాయకులలో ఆఖరివాడు పివి

మైనార్టీ ప్రభుత్వానికి నేతృత్వం వహించి
ఆయనకున్న అపార అనుభవాన్ని రంగరించి
ఐదు సంవత్సరాలు పరిపాలనను పూర్తిచేసి
ఆర్ధికప్రగతిని సాధించిన అపరచాణిక్యుడు పివి

సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి
కుంటుపడిన దేశవ్యవస్థను పట్టాలెక్కించి
ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసి
భారతదేశాన్ని మేటిదేశంగా మార్చిన దార్శనికుడు పివి

సమర్ధతకు పట్టం గట్టి
బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు తెచ్చిపెట్టి
ఆర్థిక స్వావలంబనకై ప్రపంచీకరణను ప్రోత్సహించి
సోషలిస్టు ఆర్థిక విధానాలకు మంగళం పాడిన రాజనీతిజ్ఞుడు పివి

భారతీయ మేధస్సును ప్రపంచవ్యాప్తం చేసి
దౌత్య సంబంధాలలో చెరగని ముద్ర వేసి
భారత అద్భుతమైన అభివృద్ధికి బీజంవేసిన
ఆర్థిక సంస్కరణల పితామహుడు పివి

నీతి నిజాయితీలతో మంచి వ్యక్తిత్వాన్ని
అద్భుత పద ప్రయోగాలతో వక్తృత్వాన్ని
రచనలతో సాహిత్య అకాడమీ పురస్కారాన్ని
అందుకున్న సాహిత్యవేత్త పివి

బహుభాషావేత్తగా,దేశ ప్రధానిగా
భారత జాతి ఖ్యాతిని జగద్విఖ్యాతం చేసిన సుగుణశీలి పివి

 ***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!