జనరంజకాలు

జనరంజకాలు

రచన:: పిల్లి హజరత్తయ్య

జానపదమున నివసించువారు జానపదులు
వారు పాడుపాటలు జానపదగేయాలు
జనుల హృదయాల్లో జనించిన గీతాలు
ప్రచారం అవసరంలేని జానపదుల సంగీతాలు
జగతిని నిద్దురలేపే జనరంజకాలు

జనులలో కాకతాళీయంగా ఉద్భవించినవి
జనాలు చిత్తానుసారము పాడుకునేవి
దేనిగురించి ప్రత్యేకంగా కూర్చబడినవి కావు
జనుల జీవితాల్లో పెనవేసుకొనినవి
మనసును రంజింపజేసే జీవధారలు

మానవీయ సంస్కారాన్ని పెంపొందిస్తుంది
శ్రమతో జీవితాన్ని ఉద్దీపింపజేస్తుంది
పరహితమే జీవితపరమార్థమనిబోధస్తుంది
జనజీవన సంస్కృతిలో అంతర్భాగమౌతుంది
జానపదుల సంగీతానికి సజీవస్రవంతులు

ఒగ్గుకథ,బుర్రకథ తోలుబొమ్మలాటలు
ప్రసిద్ధి చెందిన కొన్ని జానపదకళలు
వాన,పడవ,గొబ్బిళ్ళ వంటి పాటలు
జానపద గేయానికి మాతృకలు
మనిషిని ఉల్లాసపరిచే మనోరంజకాలు

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!