మధుర ప్రణయ భావ గని

మధుర ప్రణయ భావ గని

రచన::చంద్రకళ. దీకొండ

నీతో చెప్పాలని…
అడగవూ అదేమని…?!
చెప్పను ఏమని…
చెంతకు రమ్మని…
ఆహ్వానిస్తోంది ఆమని…
కోయిల పాటలతో రా…రమ్మని…!
సరసకు చేరుకోమని…
సందిట చేకొమ్మని…
మదిలో ఊహల ఝుమ్మను ధ్వని…
కమ్ముకొనెను కమ్మని రసధుని…!
పదపదమని… పరుగున పదమని..
తొందరిస్తోన్న ఆశల ఊసుల ఊయలూగుతోన్న సౌదామిని నేనని… !
కలలో ప్రియవల్లభుని గని…
విరహంలో విహరిస్తోన్న ప్రణయిని…
మధుర ప్రణయ భావ గని నేనేనని!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!