మార్పు రావాలి మహిళలో

నేటి సంఘంలో అతివలు బాధలు బాధ్యతలతో సతమతమవుతూ

జీవనసాగర అలల తాకిడిని అనుభవిస్తూ

బానిసలా బ్రతుకులీడుస్తున్న భామలెందరో

కొందరికే ఆర్ధిక స్వాతంత్రము

మరికొందరికి మల్లెల సాంగత్యం

మానవత్వం లేని మృగాల చేతిలో విలవిలా

మమతానురాగాలు లేని కుటుంబాలలో మహిళలు

గృహహింసకు గురి అవుతున్న గుడిలేని దేవతలు

గూండాయిజంతో గుప్పున కాలుతున్న మహిళలు

అమాయకత్వంతో బలవుతున్న ఆడపిల్లలెందరో

అమ్మ నాన్న ని చూసి భయపడుతూ

బ్రతుకుతున్న బంధాల ఊబిలో బాలలు

అసూయ జ్వాలలతో దగ్దమవుతున్న తోటి దైన్య మహిళలు

చట్టాలెందుకు చట్టసభలెందుకు

చట్టసభలో పదవులెందుకు

చట్టసభలో మహిళలకు సీట్లెందుకు

ప్రక్కనున్న పడతిని గౌరవించలేనప్పుడు

చైతన్యంలేదా చరిత్రకు

చెమ్మగిల్లిన చెరకు దయలేదా

సానుకూలదృక్పదం తోటి మహిళలు చైతన్య దీపికలై నవ్యకాంతిని నింపాలి

విశాల ప్రపంచంలో వినూత్న మార్గం వెయ్యాలి

మహిళలు లేవండి నడుము బిగించండి

సమాజాన్ని మేల్కొల్పి చైతన్యవంతులను చేద్దాము

ఆలోచించండి నవ్యదీపికలై రమణులంతా కదిలి మార్పు చెయ్యండి

నేటిమహిళలో మార్పు రావాలి

అప్పుడే మహిళకు గుర్తింపు

వి విజయశ్రీదుర్గ

You May Also Like

One thought on “మార్పు రావాలి మహిళలో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!