మానవతా రూపమతడు!

అంశం:(” వివేకానందుడు”)

 మానవతా రూపమతడు!

-పిల్లి.హజరత్తయ్య

Pilli hajaratthayya

పుట్టగానే పువ్వు పరిమళిస్తుంది అన్నట్లు
మంచి గుణాలను పుణికిపుచ్చుకొని
పుట్టిన సహృదయ రూపమతడు.!

జీవుడే దేవుడని నమ్మి
దరిద్ర నారాయణ సేవ గొప్పదని
హితోపదేశం చేసిన తత్వ రూపమతడు..!

భారతదేశాన్ని జాగృతం చేసి
యువతకు దిశా నిర్దేశం చేసి
జాతీయ యువజన దినోత్సవమై
మెరిసిన దివ్య ప్రబోధమతడు..!

భారతదేశ ఔన్నత్యాన్నివిదేశాలలో చాటిన ఆధ్యాత్మిక రూపమతడు..!

నదులన్నీ చివరకు సముద్రంలో కలిసినట్లు
మనిషి ఎంచుకొనే దారులు వేరైనా
చివరికి దైవాన్ని చేరుకోక తప్పదనే
వేదాంతాన్ని చెప్పిన దైవ స్వరూపమతడు..!

మతతత్వం మూఢభక్తి
భూమిని పట్టి పీడిస్తుంటే
భూమిపై ఉన్న మట్టి ఎర్రబడి
నాగరికతలునాశనమవుతున్నాయని
అందుకే పిడివాదాన్ని,
హింసను దూరంచేసే
మేలైన సమాజం రావాలని
ఆకాంక్షించిన సేవా రూపమతడు..!

మనిషి పై సానుభూతి చూపని
సంఘాలు నిష్ప్రయోజనమని
మనుషులకు సేవ చేయడమే
జీవిత పరమార్థమని చాటిన
మానవతా రూపమతడు..!

***

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!