సమకాలీన సాహితీ విప్లవం

అంశం:(” కొమర్రాజు వెంకట లక్ష్మణరావు”)

సమకాలీన సాహితీ విప్లవం

-పిల్లి.హజరత్తయ్య

Pilli hajaratthayya

వెంకటప్పయ్య గంగమ్మల
దాంపత్య తోటలో విరిసిన కుసుమం
చరిత్రను,విజ్ఞానరచనలను అందించిన
సమకాలీన సాహితీ విప్లవం..!

అజ్ఞానాంధకారంలో నిద్రాణమైన
తెలుగుజాతిని మేల్కోలిపిన మహాపురుషుడు
వైజ్ఞానిక దృక్పథాన్ని విస్తరించడానికి
జీవితాన్ని ధారపోసిన పరిశోధకుడు..!

ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం గ్రంథానికి
శ్రీకారంచుట్టి తెగువ చూపిన విజ్ఞానవేత్త
ఆంధ్ర పరిశోధక మండలిని స్థాపించి
శాసనాలను వెలుగులోకి తెచ్చిన స్ఫూర్తిప్రదాత..!

ఆయన సమ్మోహనశక్తియై
శాస్త్రవేత్తలను ప్రోత్సహించినారు
ఎందరో సాహితీమూర్తుల
హృదయాంతరాలను కదిలించినారు..!

స్వభాషలో విద్యాబోధన జరగాలని
మాతృభాష గొప్పతనాన్ని చాటినాడు
సమాజాన్ని సంస్కరించడానికి
సంఘసంస్కర్తయై గర్జించినాడు..!

తెలుగు భాష ఉన్నతికి
ఆయన చేసిన సేవ స్మరణీయం
విజ్ఞాన సర్వస్వ నిర్మాణానికి
తను చూపిన మార్గం అనితరసాధ్యం..!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!