చెలియ

చెలియ

రచయిత :: డా.బాలాజీ దీక్షితులు పి.వి

సప్తస్వర శృతులు
మెదిలే నీ నయనాలు

సొంపులు, మధువనిలో
విరిసే పూపరిమళ తరంగాలు

వలపుల అస్త్రాలు
ఎదను చుట్టేసే కన్నె పతంగాలు

వంపులు, తిరిగిన వయ్యారాలతో
వలవేసి పట్టిన కృతి సరాగాలు

మాటలకందని సోయగం
కవితలకందని కావ్యం
భాషకు అందని భాష్యం
నిండైన నీ రూపం
నా ఊహా తరంగం..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!