మొక్కలు నాటు సంరక్షించు

ప్రక్రియ :: సున్నితం 
అంశం:: మొక్కలు నాటు సంరక్షించు

రచయిత :: మైలవరపు వెంకట పద్మావతి

మొక్కలు పెంచు అవి
మనకు పూలు,పండ్లు
ఇచ్చి ఆనందం నిచ్చును.
చూడ చక్కని తెలుగు సున్నితంబు.

ఎన్నో మొక్కలు వాటి
రూపు రేకలు వేరు.
వాటి పూలు వేరు .
చూడ చక్కని తెలుగు సున్నితంబు.

మొక్కలు పరులకు ఉపకారం
చేయును అవి మనకు
ఆనందాన్ని, సంతోషము నిచ్చును.
చూడ చక్కని తెలుగు సున్నితంబు.

మొక్కల దళములను కోసిన
మనకు తిరిగి దళముల
నిచ్చును.వాటిని తెంచుదుము
చూడ చక్కని తెలుగు సున్నితంబు.

మొక్కలను రక్షించు అవి
మనకు ప్రాణవాయువు నిచ్చును
మొక్కలే రేపటి చెట్లు.
చుడ చక్కని తెలుగు సున్నితంబు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!