ప్రొద్దు పొడవదేమో

//ప్రొద్దు పొడవదేమో//

రచయిత::ప్రసాదరావు రామాయణం

 

నల్లని మసిపూసుకుంది వినువీధి
చుక్కలను దూరంగా తరిమేసిన నిశీధి
వీధుల కనులకు కాటుకే కనిపిస్తూంది
నిష్కాంతిగా,నిర్జీవంగా!
భారతి నల్లని ముసుగేసి
కన్నీరు కారుస్తోంది నీటిబుగ్గలా
ముఖాలు లేని పాలకులు
చేతులు పైకెత్తేశారు ఆకాశం వైపు

చీకట్లో చేతులు చాచి
దేవుకుంటున్నారు
వారి ఆత్మీయుల శవాల కోసం

శ్వేత యూనిఫారంలో
స్టేతస్కోపు భుజాలపై
ముఖాలకు పులుముకుని నల్లరంగు
మందులూ సూదిమందులూ
గాదుల్లో త్రొక్కి
ఖాళీ చేతులు విదిలిస్తూ
కర్కశంగా…..

తప్పెటలు కొట్టాయి ఛానళ్లు
తాళాలు వేస్తున్నారు దేశానికని
మందులే కాదు మాకులే కాదు
పచారీ సామానూ పరువులెట్టాయి
నల్ల బజారుకు…

“అదిగో ద్వారక, ఆలమందలవిగో”
పాడుకుంటున్నాడో పాదచారి
రింగురింగుల రాగాలతో
వలసకూలీ ఏమో
అదో బాధోపశమనం!
అదో సాంత్వన!
అదో నిస్సహాయత!

ఎక్కడ ప్రొద్దు పొడిచేది?
ఎప్పుడు ప్రొద్దు పొడిచేది?
సూర్యుడే ముఖం చాటేస్తే!

****

You May Also Like

One thought on “ప్రొద్దు పొడవదేమో

  1. Anni adbhuthamga unnayi kavithalu kadhalu chaduvu thi unte okkokkari ma no bhavalu eantha natural ga unnayi ani pistunnayi. Andaru మిత్రులు inka inka ilage munduku sagalani manoharam patrika mitrula kavithalatho kathalatho antho unnatha stayiki eagalani kkorukuntu. Karuna sry nalla🙏🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!