తొలిచూపులో ప్రేమ

తొలిచూపులో ప్రేమ

రచన – దీప్తి

నిమిష …! నిమిష …! లేమ్మా తొందరగా ఎన్ని సార్లు లేపాలి …. పాలు ఇంకా రాలేదు. మీ నాన్న గారు ఆఫీస్ కి తొందరగా వెళ్ళాలి అన్నారు. ఒక పాల పేకెట్ తీసుకురా తల్లి… అబ్బబ్బా…. ఏంటమ్మా ప్రశాంతంగా పడుకోనివ్వవు ? రోజూ ఏదో వంకతో ప్రొద్దుటే లేపుతావు అంటూ బెడ్ మీద నుండి లేచాను. నీ కోసం కాదు నాన్న కోసం వెళ్తాను. 

భయ్యా! ఒక పాల పేకెట్ ఇవ్వు.. అలాగే నిమిషమ్మ… 

ఓయ్ రాక్షసి ! అన్నమాట వినిపించి అటు పక్కగా చూసా, ఆరు అడుగుల పొడవుతో అందమైన నవ్వుతో చూడగానే అబ్బ ఏం ఉన్నాడు అని అనిపించేలా ఉన్నాడు ఒక అబ్బాయి. రెండు నిముషాలు అలానే చూసాను’. అది తలుచుకుంటే నాకే నవ్వొచ్చింది నేను నేనే నా అని…..! 

ఒరేయ్ ! నువ్వు అలా అనడం మానవా ఎన్నిసార్లు చెప్పాలి నీకు అలా అనొద్దనీ. రిషి నువ్వు మారవురా అసలు అంటుంది సిరి. నా ముద్దుల అక్కవి నిన్ను అలా అంటేనే నాకు ఇష్టం కానీ… సరేలే బావ ఎలా ఉన్నారు. ఎన్నాళ్ళు అయింది నువ్వు వచ్చి ఇప్పటికి వచ్చావు అన్నాడు రిషి. బావకి ఏమిరా ! బంగారంలా ఉన్నాడు. ఇప్పటికి అయినా వచ్చాను సంతోషించు.

వాళ్ళ మాటలు వింటూ ఇంటికి వచ్చాను. ఎంత సేపు రావడం అని అమ్మ అంటున్నా నాకు వినబడలేదు. ఓయ్ రాక్షసి ! అన్న ఆ ఒక్క మాట దగ్గర ఆగిపోయింది నా మనసు. ఆ అందమైన రూపం ఆ నవ్వు పదే పదే గుర్తుకు వస్తుంది. అలానే రెడీ అయి ఆఫీస్ కి వెళ్ళాను. 

నాలుగు నెలలు తరువాత… 

ఆఫీస్ నుండి ఇంటికి రాగానే అమ్మ కాఫీ ఇచ్చి నాన్న నీతో మాట్లాడాలి అన్నారు అని అంది. ఫ్రెష్ అయి వస్తానమ్మా అని చెప్పి రూమ్ కి వచ్చాను. క్రిందకు వచ్చేటప్పటికి నాన్న హాల్లో ఉన్నారు. ఏంటి నాన్న ఏదో మాట్లాడాలి అన్నారు అంట. ఇలా రా వచ్చి కూర్చో తల్లి.. ఏం లేదురా మన శ్రీనివాస్ అంకుల్ ఉన్నారు గా వాళ్ళకు తెలిసిన వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అంట. రిషి అని అబ్బాయి చాలా మంచివాడు, కుటుంబం కూడ చాలా మంచిదట… వాళ్ళు నిన్ను అడిగారు రా.. నాన్న.

 “రిషి” అని పేరు పలకగానే నా మనస్సులొ ఏదో అలజడి ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపానో తన గురించి ఆలోచిస్తూ ఆ రోజు తను కనిపించినప్పటి నుండి తన రూపమే గుర్తుకు వచ్చేది. తను నా జీవితంలోకి వస్తే బాగుండును. ఆ నవ్వు చూస్తూ తన మాట వింటూ.. .నా ఆలోచన కి బ్రేక్ వేసి.. మీ ఇష్టం నాన్న అన్నాను. “తొలిచూపులోని ప్రేమ ఎంత నిజమో! తెలీదు కానీ ఆ ప్రేమ మన ముందుకు వస్తే మన కన్నా అదృష్టవంతులు ఉండరేమో…” 

పెళ్లిచూపులు రోజు రానే వచ్చింది. అమ్మ హడావిడిగా నాన్నను కంగారు పెడుతూ పనులు చెపుతుంది. అంతలో పెళ్లి వాళ్ళు వచ్చారు. అమ్మ నేను రెడీ అయ్యానా? లేదా? అని చూడడానికి వచ్చి తయారు అయిన నన్ను చూసి బుట్టబొమ్మలా ఉన్నావు బంగారుతల్లి అని కళ్ల నీళ్లు పెట్టుకుంది. ఇంతలో నాన్న అమ్మాయిని తీసుకురా అంటే అమ్మ నన్ను తీసుకొని కిందకి వచ్చి వాళ్ళ ఎదురుగా కూర్చోపెట్టింది.

పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అబ్బాయిని అమ్మాయిని మాట్లాడుకోనివ్వండి అన్నారు. ఎవరా అని చూసా, తను ఆ రోజు రిషి దగ్గర ఉన్న అమ్మాయి. అంటే పెళ్ళికొడుకు ఎవరా..! అని చూసా అక్కడ ఎవరు లేరు. అబ్బాయి ఆ గదిలో ఉన్నాడు వెళ్లి మాట్లాడమ్మా అన్నారు. నేను ఆ గదిలోనికి వెళ్ళగానే తను అటు వైపు తిరిగి నుంచున్నాడు. 

హలో ! అండి అన్నాను. వెనక్కి తిరిగారు. అక్కడ రిషి ఉన్నాడు. నాకు ఏం మాట్లాడాలో తెలీలేదు. కళ్ల నిండా నీళ్లతో అలా చూస్తూ ఉన్నాను. తనకు నన్ను అలా చూసి అర్ధం కాక ఏమైంది అండి..! అని కంగారుగా అడిగాడు.  ఏం లేదు అని పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకున్నాను. అప్పుడు తను నా ఎదురుగా కూర్చొని నా పేరు రిషి అండి అని పరిచయం చేసుకున్నాడు. తెలుసు అండి అన్నాను. చిన్నగా నవ్వారు.. అది చూసి నా ప్రాణం తాను అనిపించింది. 

రిషి ఎలా మొదలు పెట్టాలి అని ఆలోచిస్తూ నిన్ను మొట్ట మొదటి సారి నాలుగు నెలల ముందు చూసాను. మిల్క్ బూత్ దగ్గర అని నా వంక చూసాడు. “లవ్ ఎట్ ఫస్ట్ సైట్” మీద నీకు నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు కాని నిన్ను చూసిన క్షణం నుండి నువ్వు నా జీవితం అనిపించింది. నీకోసం చాలా వెతికాను. నిన్ను ఎలా అయినా కలుసుకుంటాను అని గట్టి నమ్మకం అని తాను చెప్పేలోగా నేను తన దగ్గరకు వెళ్లి గట్టిగా హత్తుకున్నాను. మాటలు రావడం లేదు. కొద్దిగా తేరుకుని దూరంగా జరిగి “మీదే కాదు నాది కూడా తొలిచూపులో చిగురించిన ప్రేమే” అని జరిగిందంతా చెప్పేసరికి రిషి ఆనందం అంత ఇంత కాదు. 

నిమిషని గట్టిగ హత్తుకుని శ్రీనివాస్ అంకుల్ కి థాంక్స్ చెప్పాలి అని అన్నాడు. ఎందుకు అన్నట్టు చూసాను. వాళ్ళ ఇంటికి వెళ్లినప్పుడు వాళ్ళ అబ్బాయి పెళ్లి ఫోటోలలో నిన్ను చూసాను. అప్పుడు చెప్పాను ఆయనకు నీ గురించి అప్పటి నుండి ఈ పెళ్లి చూపులు వరకు తీసుకువచ్చారు. రిషి టేబుల్ మీద ఉన్న ఫ్లవర్వాజ్ లోని ఒక రోజ్ తీసుకుని మోకాలు మీద నుంచుని నిమిషకి ఇలా ప్రపోజ్ చేసాడు… 

“ నిన్ను చూసిన క్షణం నుండి 

నాలో నేను ఉన్నాననే  సంగతే మరిచాను…

తొలిచూపు… 

తొలివలపు…

తొలిపిలుపు 

అన్నీ నువ్వే అయినప్పుడు 

అది ప్రేమ అయితే 

ఆ ప్రేమవి నువ్వే… 

నా ప్రాణానివి నువ్వే… 

నా ప్రేమ సామ్రాజ్యానికి 

రాణిగా ఉండగలవా నిమిష…?”

ఇది కలయా… నిజామా… అనే సందిగ్ధంలో ఆ క్షణం నను నేనే మరచి నా కనుల ఎదుట నిలిచిన నా తొలిప్రేమను నింపుకుంటూ…. అలా నా ఊహలలో తేలియాడుతున్న నాకు రిషి వేసిన చిటికెతో ఈ లోకంలోకి రాగా నును సిగ్గు చెక్కిళ్ళపై చేరగా నా మనసు తెరలలో దాచుకున్న ప్రేమను ఎలా తెలపాలో తెలియక సతమతమవుతూ…..

“ నా తొలిప్రేమకి తొలి బంధం నువ్వు వేస్తా అంటే…

ముడి వీడని ప్రాణమై నీతో కలిసి నడుస్తా రిషి ”

అలా వారి “తొలిచూపులో ప్రేమ”ని పరిణయంగా మార్చుకుని ఏడడుగుల బంధంతో ఏకమై వారి ప్రేమని ఆనందమయం చేసుకున్నారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!