నా పయనం నీ జ్ఞాపకాలతో

నా పయనం నీ జ్ఞాపకాలతో

మోడులా మిగిలిన నా జీవితానికి…
ఆమనిగా వచ్చి వసంతాలు తెచ్చావని…
కోయిలనై మధురగానం ఆలపించెను నా మది…
నీ ప్రేమను అణువణువునా నింపుకున్న నా మనస్సు…
చిత్రవర్ణాల సీతాకోకచిలకై గగనవిహారం చేసింది…
నీ ఊసులు నా ప్రేమకి ఊపిరిని పోసాయి…
నిను చూసిన నా మోము చంద్రబింబమై పండువెన్నెల కురిపించెను….
వసంతం వచ్చి వెళ్లినట్లు నీలో, నీ ప్రేమ లో మార్పు…
బహుశా ప్రేమ అనుకొని భ్రమ ఏమో నాది…
నీకొకటి తెలుసా…
ప్రేమ శాశ్వతం …
మోహం, కోరిక, ఆకర్షణ ఏదైనా సరే…
కాలగమనంలో కనుమరుగవ్వక తప్పదు…
నమ్మకం, ప్రేమ, లేని చోట బంధం నిలబడదు…
కానీ నాది ప్రేమ అది శాశ్వతం నా తుది శ్వాస వరకు…..
నీవు లేవని జీవితం అక్కడితో ఆగిపోదు కదా….
నా లక్ష్యమార్గంలో నా పయనం నీ జ్ఞాపకాలతో ప్రాణబంధమా….

  రచన – లంకా జయ కుమారి

You May Also Like

One thought on “నా పయనం నీ జ్ఞాపకాలతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!