మహి మాన్విత దినం”

మహి మాన్విత దినం

రచన :: పిల్లి.హజరత్తయ్య

రెండు మనసులు ఒక్కటై
ముందుకు సాగే పర్వదినము
రెండు కుటుంబాలలో ఆత్మీయతలు
వెల్లివిరిసే పండుగ దినము
శుభలగ్నపు ఘడియల్లో
నూతన వధూవరులుఏకమయ్యే
మహత్తరమైన దినం..!

పచ్చని తోరణాలు,పసుపు అలంకరణలు
మంగళ వాయిద్యాలు ,వేద మంత్రాలు
జీలకర్ర,బెల్లం సాక్షిగా
ఒక్కటయ్యే మహిమాన్విత దినం..!

పచ్చని వెలుగు జిలుగులు
పేరంటాల కోలాహలాలు
బంధువుల అక్షింతలు, మూడు ముళ్ళు
అగ్నిసాక్షిగా ఏకమై
అరుంధతి నక్షత్రం గాంచే
మరుపురాని దినము
మహిలో మహోన్నతమైన దినం..!

జీవితంలోని బంధాలన్నిటిలో
పవిత్రమైనది వివాహ బంధం
భారతీయ సమాజంలో
ముఖ్యమైనది ఏడడుగుల బంధం
వివాహం సహజీవనానికి ఆహ్వానం
జీవన సౌభాగ్యానికి ఆలంబనం
మానవాళికి శుభదినం..!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!