ధైర్యమే ఆయుధం

ధైర్యమే ఆయుధం

రచయిత :: స్వాతి తంగళ్ళ పల్లి

కొంత మంది ఎక్కడో సంబంధం లేని
స్మశాన శవాలు కాల్చుతున్న ఫొటోస్ పెట్టీ
కరోనా అంటూ జనాల్ని ఇంకా భయపెడుతూ
పోస్ట్ లు పెడుతున్నారు
ఎందుకలా చేయడం మీరు ధైర్యం చెప్పరు
ఎదుటి వాడిని ధైర్యంగా వుండనివ్వరా

దయచేసి ధైర్యం చెప్పండి
అధైర్య పరచకండి

ప్రకృతిని ఆస్వాదించండి
ధృడమైన శరీరాన్ని తయారు చేసుకోండి
అంతకు మించి ఆత్మ విశ్వాసంతో మెలగండి

ఇది కరోనా కాలమే
కానీ ధైర్యంగా ఉండండి
తోచిన పని చేయండి
బాధ్యతగా వ్యవహరిస్తూ
ఆరోగ్యంగా ఉండండి

చంపక ముందే భయంతో చచ్చిపోకుండా
బాధ్యతగా మసులుకుంటూ బ్రతికిపొండి
అందుకే భయం వద్దు బాధ్యతే ముద్దు

ఒక్కొక్కరు దీనంగా చనిపోతున్నారు
అన్న విషయం గురించి
తక్కువ ఆలోచించండి
ఎలా సంకల్పంతో దైర్యంగా
ముందడుగు వేస్తూ బ్రతకాలి
అని ఎక్కువ యోచనతో
ప్రతి కార్యం మొదలెట్టండి

శ్వాసించండి సవాళ్ళను సవాలు చేస్తూ
శుభ్రమైన వస్త్రాలను అస్త్రాలుగా ధరించండి
కొద్ది రోజులే ఈ గడ్డు కాలం అనుకోండి
ఎదురీదలేము అనుకోకుండా
ఎదురొడ్డి నిలిచి కరోనాను జయించుదాం

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!