తోడేళ్ళు

(అంశం:మానవత్వం ముసుగులో వ్యాపారం)

తోడేళ్ళు

రచయిత :: చైత్రశ్రీ(యర్రాబత్తిన మునీంద్ర)

భయమనే పెట్టుబడిని
వ్యాపార రహస్యంగా మార్చి
దైవ స్వరూపులే దానవులై
మానవత్వం మరచిన మృగాలై
శాస్త్రీయతా ముసుగేసిన
వైద్య తోడేళ్ళున్నాయ్ జాగ్రత్త…

ఆదమరచారా
చేసేస్తారు సర్వం క్షౌరం
లేదా చూపెడతారు కైలాసం
అందుకే తెలుసుకో కనీస జ్ఞానం
అదే నీకు ఆరోగ్యపు మార్గం…!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!