నీ ప్రేమ లోకంలో

నీ ప్రేమ లోకంలో..

రచయిత :: శ్రీలత.కె

ఈ ప్రపంచంలో ఇంకా ఎవరికి తెలియని మాయలోకం ఏది అంటే అది ప్రేమ లోకమే..
ప్రేమ అంతా మనసు చేసే ఇంద్రజాలం..

తామరాకు మీది నీటి బిందువు అంత అందంగా..
చంద్రుని నుంచి జాలువారే వెన్నెల అంత హాయిగా..
ఆవు పాల అంత స్వచ్చంగా..
మదిని తాకుతూ ఉంటాయి నీ ప్రేమ గిలిగింతలు.

అందుకేనేమో.. నా మదిలో..
ఈ భావమధురిమలు…

ప్రతి ఉదయం.. నీ కనురెప్పలపై..
నా ముద్దుల వేడి స్పర్శతోనే
నీకు సూర్యోదయం అవ్వాలని..
నీ పెదాల మీద నా తీపిఅధర సంతకంతో
మధువు రుచి చూపాలని..
నువు కూర్చున్నప్పుడు నీ వెనకనుండి
నీ మెడచుట్టూ చేతులు వేసి..
నీ భుజం మీది నుండి ముందుకు వంగి
నిన్ను ముద్దాడాలని….
జీవితం అంతా నిన్ను చూస్తూ..
నీ ప్రేమలోకంలో విహంగాన్నై విహరించాలని..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!