సాగే తన శ్వాస

అంశం:: (“అన్నదాత ఆకలి కేక” )

సాగే తన శ్వాస

రచన: పిల్లి.హజరత్తయ్య

Pilli hajaratthayya

తనువును చీల్చి ఇచ్చినా
తరువులకు రక్షణ లేనట్లు
రైతు రక్తాన్ని చిందించి
అందరి ఆకలి తీర్చినా
జీవితంలో వెలుగుకు నోచుకోడు..!

ప్రకృతి అన్నదాతతో ఆడుకున్నా
సర్కారోళ్ళు ఎరువులు ఇవ్వకున్నా
దళారీలు పంటను దగాచేసినా
పట్టువిడువని విక్రమార్కునిలా
పంటలు పండిస్తునే ఉంటడు..!

ప్రభుత్వంసాయంచేయకపోయినా
కాలం తనను ఎగతాళి చేసినా
అప్పలఊబిలో కూరుకుపోయినా
సాగే తన శ్వాస అంటూ
సర్వస్వము ధారబోస్తడు..!

తన పోరాటంలో ఓడిపోయినా
ఎందరికో బతుకు నిస్తడు..
ఎరువులు,విత్తనాలు,గిట్టుబాటుధరలు నిచ్చి
అన్నం పెట్టిన చేతిని ఆదుకుని
అన్నదాతకు ఆసరాగా నిలుద్దాము..!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!